Exercises : ఈ నాలుగు రకాల ఎక్సర్ సైజెస్ చేస్తే చాలు… సమస్యలన్నీ మాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Exercises : ఈ నాలుగు రకాల ఎక్సర్ సైజెస్ చేస్తే చాలు… సమస్యలన్నీ మాయం…!

 Authored By ramu | The Telugu News | Updated on :14 August 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Exercises : ఈ నాలుగు రకాల ఎక్సర్ సైజెస్ చేస్తే చాలు... సమస్యలన్నీ మాయం...!

Exercises : ప్రతి ఒక్కరూ వర్కౌట్ చేయడం వలన ఆరోగ్యానికి మంచి మేలు జరుగుతుంది. నిజం చెప్పాలంటే. వర్కౌట్ లో కొన్ని రకాలు ఉన్నాయి. అవి ఏరోబిక్స్, స్ట్రేచ్చిగ్, స్ట్రెంథనింగ్, బ్యాలెన్స్ వర్కౌట్. ఈ వర్కర్స్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటిని చేయటం వలన లాభాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రెచింగ్ : స్ట్రెచింగ్ చేయడం వలన ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. దీనివలన కండరాల తిమ్మిర్లు మరియు నొప్పులు మరియు కీళ్ల నొప్పులు లాంటివి తగ్గుతాయి. కావున వారానికి మూడు లేక నాలుగు సార్లు ఈ వర్కౌట్ చేయండి.

స్ట్రెంథనింగ్ : ఈ వర్కౌట్ చేయడం వల్ల మజిల్ మాస్ అనేది పెరుగుతుంది. దీని వలన మీరు రోజు వారి చేసుకునేటటువంటి పనులు అనగా గార్డెనింగ్ మరియు బరువులు ఎత్తటం లాంటి వాటిని ఈజీగా చేసుకోవచ్చు. దీంతో మీ కండరాలనేవి ఎంతో బలంగా తయారవుతాయి. అలాగే ఎముకల బలం కూడా ఎంతగానో పెరుగుతుంది. అంతేకాక బ్లడ్ షుగర్ మరియు బరువు కూడా తగ్గుతారు. అలాగే బ్యాలెన్సింగ్ అనేది ఏర్పడి మన పోశ్చర్ ఎంతో మెరుగ్గా ఉంటుంది. అలాగే కీళ్లలో ఒత్తిడి మరియు నొప్పి కూడా తొందరగా తగ్గుతుంది…

Exercises ఏరోబిక్స్

ఈ ఏరోబిక్స్ చేయడం వలన హాట్ బీట్ రేట్ మరియు బ్రీతింగ్ అనేది స్పీడ్ అప్ అవుతుంది. ఇది మీ శరీరంలో ఎన్నో రకాల పనులకు మేలు చేస్తుంది. అలాగే గుండె మరియు ఊపిరితిత్తులకు మంచి ఎక్ససైజ్ లా కూడా పనిచేస్తుంది. అలాగే మీలో ఓర్పును కూడా పెంచుతుంది. అంతేకాక మీ యొక్క గుండె మరియు ఊపిరితులు మంచిగా పనిచేసేలా చేసి కండరాలకు తగిన రక్తాన్ని అందిస్తుంది. ఈ ఏరోబిక్స్ చేయటం వలన రక్తనాళాల గోడలు సడలించడం మరియు రక్త పోటు తగ్గటం, రక్తంలో చక్కెర స్థాయి తగ్గటం, మంటను కూడా తగ్గించి మానసిక స్థితిని పెంచుతుంది. అలాగే బరువును నియంత్రించడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. దీనితో పాటు గుండె సమస్యలు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, బ్రెస్ట్,కొలన్ క్యాన్సర్, డిప్రెషన్ లాంటి ఎన్నో సమస్యలు తగ్గుతాయి. కావున వారానికి కనీసం 150 నిమిషాల పాటు మితమైన తీవ్రతతో కూడినటువంటి వర్కౌట్ చేయండి. అలాగే స్పీడ్ గా నడవడం,స్విమ్మింగ్ చేయడం, జాగింగ్, సైక్లింగ్, డ్యాన్స్, స్టెప్ ఎరబిక్స్ లాంటి ఎక్సర్సైజ్ లు చేయడం మంచిది.

Exercises ఈ నాలుగు రకాల ఎక్సర్ సైజెస్ చేస్తే చాలు సమస్యలన్నీ మాయం

Exercises : ఈ నాలుగు రకాల ఎక్సర్ సైజెస్ చేస్తే చాలు… సమస్యలన్నీ మాయం…!

బ్యాలెన్సింగ్ వర్కౌట్ : మన శరీరంలో బ్యాలెన్సింగ్ పెంచడంలో ఈ వర్కౌట్ ఎంతో మేలు చేస్తుంది. మన వయసు పెరుగుతున్న కొద్ది మనలో బ్యాలెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. ఈ బ్యాలెన్సింగ్ వర్కౌట్ చేయడం వలన మన బాడీలో బ్యాలెన్స్ అనేది ఎంతో పెరుగుతుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి కంటి సమస్యలు మరియు వినికిడి సమస్యలు మరియు కీళ్ల సమస్యలు అన్నిటిని రివర్స్ చేసుకోవచ్చు. సాధారణంగా ఈ బ్యాలెన్సింగ్ వర్కౌట్ ని మీరు కళ్ళు తెరిచి లేక మూసుకొని ఒక కాలు పై నిలవడం, మడమ నుండి కాళీ వరకు నడవడం లాంటివి చేయవచ్చు…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది