Diabetes Eyes : కంటి సమస్యల ద్వారా మధుమేహం లక్షణాలను ఎలా గుర్తించాలో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes Eyes : కంటి సమస్యల ద్వారా మధుమేహం లక్షణాలను ఎలా గుర్తించాలో తెలుసా…!!

 Authored By ramu | The Telugu News | Updated on :9 September 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Diabetes Eyes : కంటి సమస్యల ద్వారా మధుమేహం లక్షణాలను ఎలా గుర్తించాలో తెలుసా...!!

Diabetes Eyes : మధుమేహం అనేది ఎంతో ప్రమాదకరమైన వ్యాధి అని చెప్పొచ్చు. ఇది నెమ్మది నెమ్మదిగా శరీరాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ప్రమాదకరంగా మారుస్తుంది. డయాబెటిస్ రక్తంలో చక్కెర సాయిని తగ్గించకపోతే అది శరీరంలోని అన్ని అవయవాలను కూడా దెబ్బతీస్తుంది. మధుమేహ సమస్య అనేది ఒక్కసారి వచ్చింది అంటే చాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. దీనికి ఇప్పటి వరకు కూడా మందు అనేది లేదు. అందుకే రక్తంలోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అయితే డయాబెటిస్ వచ్చే ముందు శరీరంలో కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి. దీంతో మీరు అలర్ట్ కావచ్చు. ఈ లక్షణాలను గనుక మీరు నిర్లక్ష్యం చేస్తే ప్రమాదానికి దారి తీస్తుంది. అలాగే కంటికి సంబంధించినటువంటి కొన్ని సంకేతాలను అసలు నిర్లక్ష్యం చేయకండి. అస్వష్టమైన దృష్టి మరియు కళ్ళల్లో నొప్పి లాంటివి కూడా డయాబెటిస్ మొదటి లక్షణాలే అని అంటున్నారు. అలాగే కంటికి సంబంధించిన సమస్యల ద్వారా మధుమేహ లక్షణాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

Diabetes Eyes కంటి ద్వారా మధుమేహ లక్షణాలు

1. అస్పష్టమైన దృష్టి : మీరు అకస్మాత్తుగా అస్పష్టమైన దృష్టి కలిగితే మీ దృష్టిలో మార్పులను గమనిస్తే తేలికగా తీసిపారేయకండి. మధుమేహం మొదటి రక్తంలో చక్కెర స్థాయిలలో మార్పులు కంటి లెన్స్ కు కూడా కారణం అవుతాయి. దీంతో అస్పష్టమైన దృష్టి కలుగుతుంది. ఇది మీ రక్తంలోనే చక్కెర స్థాయి అనేది అసాధారణంగా ఉంది అని అర్థం. అప్పుడు మీరు వెంటనే వైద్యులను సంప్రదించాలి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

2. కళ్ళల్లో ఒత్తిడి లేక నొప్పి భావన : మధుమేహం అనేది కళ్ళల్లో నరాలపై ప్రభావం చూపి,కళ్ళల్లో నొప్పి లేక ఒత్తిడికి కారణం అవుతుంది. మీరు కూడా కళ్ళలో ఏదైనా నొప్పిని ఎదుర్కొంటే అది మధుమేహానికి ఒక హెచ్చరిక అని తెలుసుకోండి. దానికి వెంటనే చికిత్స అనేది చెయ్యకపోతే ఈ సమస్య అనేది నెమ్మదిగా ఎంతో తీవ్రమవుతుంది. అలాగే గ్లాకోమా లాంటి సమస్యలకు కూడా దారి తీస్తుంది.

3. కంటి వాపు : మధుమేహం వలన కంటి చుట్టూ కూడా వాపు అనేది వస్తుంది. అలాగే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరిగి కంటి కణాలపై ఎంతో ప్రభావం చూపినప్పుడు ఈ వాపు అనేది వస్తుంది. అయితే మీరు మీ కళ్ళ చుట్టూ వాపు లేక ఉబ్బినట్లుగా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. ఇది మధుమేహ మొదటి సంకేతం కావచ్చు. కావున వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది.

Diabetes Eyes కంటి సమస్యల ద్వారా మధుమేహం లక్షణాలను ఎలా గుర్తించాలో తెలుసా

Diabetes Eyes : కంటి సమస్యల ద్వారా మధుమేహం లక్షణాలను ఎలా గుర్తించాలో తెలుసా…!!

4. రాత్రిపూట చూడడం కష్టంగా మారడం : మీకు రాత్రి పూట లేక తక్కువగా ఉన్న వెలుగులో చూడటం కష్టంగా ఉంటే ఇది కూడా మధుమేహం మొదటి సంకేతం కావచ్చు. మధుమేహం అనేది కంటి నరాలపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఇది రాత్రిపూట దృష్టిని ఎంతో బలహీనం చేస్తుంది. మీకు గనక రాత్రి పూట చూడటంలో ఇబ్బంది కలిగితే మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసుకోవటం చాలా ముఖ్యం.

5. దృష్టిలో ఆకస్మిక మార్పులు : మధుమేహం వలన కంటిచూపులో ఆకస్మిక మార్పులు వస్తాయి. ఈ మార్పులు అనేవి చాలా వేగంగా జరుగుతాయి. వీటన్నిటిని కూడా కొన్ని రోజులలోనే చూడవచ్చు. మీ దృష్టి అనేది అకస్మాత్తుగా లోపిస్తే లేక తేలియాడినట్లు కనిపిస్తే చిన్న చుక్కలు లేక స్పష్టమైన చిత్రాలు కనిపిస్తే ఇది డయాబెటిస్ రెటినోపతికి కారణం కావచ్చు. కాబట్టి ఇలాంటి సంకేతాలు మీకు గనక కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోండి…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది