Health Problems : అబ్బాయిలూ బొప్పాయి తింటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సిందే!
Health Problems : ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు ఏదైనా పరిమితంగా తిన్నప్పుడూ ప్రయోజనం ఉంటుంది. పోషకాలు ఎక్కువగా ఉన్నాయని, విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయని ఇంకేవో ప్రయోజజనాలు ఆశించి ఎక్కువ మొత్తంలో ఒకే ఆహార పదార్థాన్ని తినడం వల్ల మంచి కంటే ఎక్కువ చెడే జరుగుతుందని వైద్యులు చెబుతుంటారు. బొప్పాయి పండు సంవత్సరమంతా మనకు అందుబాటులో ఉంటుంది. భారత్ లో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో బొప్పాయి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య పడి పోవడం సాధారణం. అయితే బొప్పాయి పండు, ఆకులు ప్లేట్లెట్ల సంఖ్య వృద్ధి చేస్తాయని వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. ఈ ఆకులను, పండ్లను నీటిలో మరిగించి లేదా మిక్సీ పట్టి రసం తీసుకుని తాగితే ప్లేట్‌లెట్లు పెరుగుతాయని చాలా మంది దీనిని తీసుకోవడం మనకు తెలిసిందే.
అలాగే బొప్పాయి పండును తరచూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఉంటాయి. గుండె జబ్బులను తగ్గిచడంలో బొప్పాయి చక్కగా పని చేస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని మినిమైజ్ చేయడంలో బొప్పాయి ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను మెరుగు పర్చడంలోనూ సాయపడుతుంది. మధుమేహం ఉన్న వారిలో రక్తంలో గ్లూకోజ్ నియంత్రణను మెరుగుపరచడం, రక్త పోటును తగ్గించడంతోపాటు… ఏదైనా గాయం అయితే.. దానిని తగ్గించడంలో బొప్పాయి చేసే ప్రయోజనం ఏంతో.ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని బొప్పాయిని ఎక్కువగా తీసుకోకూడదు.. పరిమితంగా తింటేనే బొప్పాయి నుంచి ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి. ఒక పెద్ద బొప్పాయిముక్కను తింటే చాలు. అలాగే గర్భవతులు బొప్పాయిని అస్సలే తినొద్దని వైద్యులు చెబుతుంటారు. బొప్పాయికి వేడి చేసే గుణం ఉంటుంది. ఇది గర్భం కోల్పోవడానికి కారణం అయ్యే ప్రమాదం ఉంది.
బొప్పాయిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ వంటి సమస్యలకు అజీర్ణానికి దారి తీయవచ్చు. అలాగే ఏదైనా వ్యాధికి మందులు వాడుతున్నట్లైతే బొప్పాయిని తీసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే.. బొప్పాయి తినడం వలన ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. లేదా మందుల ప్రభావం సరిగ్గా పని చేయకపోవచ్చు. బొప్పాయికి రక్తంలో చక్కెరను నియంత్రించే గుణం ఉంటుంది. బొప్పాయి ఎక్కువగా తీసుకోవడం వలన ఇది చక్కెర లెవల్స్ ను బాగా తగ్గించే అవకాశం ఉంది. ఇది లో-షుగర్ కు దారి తీయవచ్చు. అలాగే కొన్ని ప్రయోజనాల కోసం తీసుకొనే బొప్పాయి విత్తన సారం…. సంతానోత్పత్తికి కీలకమైన కణాలను చలనశీలతలను గణనీయంగా మరియు ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల… పురుషులు బొప్పాయి మరియు బొప్పాయి విత్తనాలు అధిక మొత్తంలో తీసుకోకుండా ఉండటం మంచిది.