Almond Milk – Cow Milk : ఆరోగ్యానికి బాదంపాలు మంచివా.. ఆవు పాలు మంచివా.. ఏవి ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసా..?

Authored By aruna | The Telugu News | Published on: February 13, 2024, 9:00 am
  •  Almond Milk - Cow Milk : ఆరోగ్యానికి బాదంపాలు మంచివా.. ఆవు పాలు మంచివా.. ఏవి ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసా..?

Almond Milk – Cow Milk : పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. అయితే గేదె పాల కంటే ఆవు పాలు ఆరోగ్యానికి మెరుగైనవని వైద్యనిపుణులు చెబుతూ ఉంటారు.. ఆవు పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది.. ఈ పాలను చిన్నపిల్లలు కి కూడా పట్టిస్తూ ఉంటారు. అయితే చాలామందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆవు పాలు మంచిదా.. బాదంపాలు మంచిదా.. ఏవి ఆరోగ్యానికి మంచిది.. ఆరోగ్యానికి బాదం పాలు కూడా మేలు చేస్తాయి. దీనిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్ ,ఫాస్ఫరస్, లాంటి వివిధ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.  పోషకాలు పుష్కలంగా ఉండే బాదంపాలలో ఫైబర్ ప్రోటీన్ విటమిన్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయని సంగతి అందరూ తెలుసిందే.

బాదంపాలు బరువు తగ్గడానికి ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి గుండె జబ్బులను, మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా చాలా బాగా మేలు చేస్తాయి.. అయితే బాదంపాలు కొలెస్ట్రాల్ రహితంగా ఉంటాయి. ఈ పాలలో సంతృప్తి కొవ్వు మితంగా ఉంటుంది. అలాగే బాదం పాలలో విటమిన్ ఉంటుంది. బాదంపాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కంట్రోల్ చేస్తుంది. కావున డయాబెటిక్ పేషెంట్లు బాదంపాలను తీసుకోవచ్చు. ఆవుపాలకంటే బాదం పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ పోషక విలువలు విషయంలో ఎందులోనూ తక్కువగా ఉండవు.ఈ బాదం పాలన ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం…

ఇంట్లో బాదం పాలను తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు పచ్చి భాదం ను రాత్రంతా నానబెట్టాలి. తర్వాత వాటి పైన తొక్క తీసి బాదం గింజలను మిక్సీ జార్లో వేసి నాలుగు కప్పుల నీళ్లను పోసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక క్లాత్ సహాయంతో వడకట్టుకోవాలి. అంతే బాదంపాలు తయారవుతాయి.. ఎంతో న్యాచురల్ గా తయారయ్యే బాదం పాలను తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది..
ఆవు పాలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉండడం వలన చాలామందికి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఆవుపాలకంటే బాదం పాలు సులభంగా జీర్ణం అవుతాయి. అదనంగా బాదంపాలలో ఫైబర్ ఉండడం వలన ఇది జీర్ణక్రియ ప్రక్రియలు ఉపయోగపడుతుంది.

Also read

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp