Health Benefits : ఇది ఒక్క స్పూన్ తింటే చాలు.. విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయ్!
Health Benefits : ఒళ్లు నొప్పులు, కాళ్లు నొప్పులు, శరీరంలో జాయింట్ పెయిన్స్ మొదలైనప్పటి నుంచి చాలా మంది కాల్షియం లోపం ఉందని భావించి జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెడతారు. కానీ అదంతా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ సమస్యలు తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూపర్ మార్కెట్ లో దొరికే గోంథ్, కటొరా అనే పిలువబడే పదార్థాన్ని తెచ్చుకోవాలి. అయితే గోంద్ తెల్లగా, గోధుమ రంగులో స్పటిక లాగా ఉండే ఈ పదార్థం ఆయుర్వేదం పరంగా ఎన్నో ఔషధ గుణాలను కల్గి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం, గోంద్ శరీరంలో స్టామినా, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. జలుబు మరియు దగ్గు కారణంగా అనారోగ్యం బారిన పడకుండా సాయ పడుతుంది.
ఇది శరీరంలో విటామిన్ డి స్థాయిలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే వెన్ను నొప్పిని అలాగే ఇతర కీళ్ల నొప్పులను తగ్గించడంలో అత్యంత శక్తివంతమైనది. గోంథ్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే పాలిచ్చే తల్లులకు వారి రోగ నిరోధక వ్యవస్థను నిర్మించడానికి ఇస్తారు. గోండ్ లోని లక్షణాలు కాల్షియం, ప్రోటీన్ లను మంచి మూలాలు.. ఇవి బలమైన ఎముకలను అభివృద్ధి చేయడానికి మరియు నిర్వహించడానికి అవసరం.గోంథ్ ఎక్కువ గంటలు శక్తిని అందించగల సామర్థ్యాన్ని కల్గి ఉంది. ఆకలి బాధలను దూరం చేస్తుంది. ఇది చాలా మంది కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడానికి దూరం చేస్తుంది. అయితే గోంథ్ వేడి ఉత్పత్తి చేసే ఆహారం కాబట్టి శీతాకాలంలో దీన్ని తీసుకోవడం మంచిది.
గోంథ్ ను ఒక స్పూన్ నూనె లేదా ఆవు నెయ్యిలో వేయించుకోవాలి. వేయించిన తర్వాత అవి ఉబ్బుతాయి. వాటిని తీసుకొని మిక్సీలో వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి. దీన్ని రోజూ రాత్రిపూట పాలలో వేసి అరగంట వదిలేయాలి. ఇది మెత్తగా అవుతుంది. అప్పుడు దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి. తర్వాత రోజు రాత్రి పూట మెంతులను తీసుకొని ఒక స్పూన్ మెంతులు నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగి మెంతులు తినడం వల్ల కూడా శరీరంలోని ఎముకల మధ్య గుజ్జు పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ప్రతిరోజూ ఈ చిట్కాల్లో ఏదైనా ఒకటి పాటించడం వల్ల కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ నుండి ఉపశమనం పొందవచ్చు.