Health Benefits : తినగానే ఇవో మూడు ముక్కలు చప్పిరిస్తే చాలు.. లివర్ క్లీన్ అంతే!
Health Benefits : సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిమ్మకాయ, ఉసిరికాయ, నారింజ సహా పలు పండ్లను సిట్రస్ ఫ్రూట్స్ అంటారు. అంటే విటమిన్–సి సమృద్ధిగా ఉంటాయి ఇందులో. వీటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వార ఎలాంటి రోగాలు వచ్చినా సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఈ పండ్లలో అన్నింటి కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉసిరికాయతో ఉంటాయి. ఉసిరి ఎన్నో ఆయుర్వేద గుణాలను కలిగి ఉందని మన అందరికీ తెలిసిందే. దీనిని తాజాగా దొరికినప్పుడు – ముక్కలుగా చేసి తినడం లేదా రసం తీసి తాగడం వంటివి చేయడం వలన శరీరంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే వీటిని ఎండ బెట్టి సంవత్సరం మొత్తం ఉపయోగించుకోవచ్చు. కొండ ఉసిరికాయ రసం చేదు రుచిని కలిగి ఉంటుంది. తిన్నప్పుడు నోరు మరియు నాలుక తియ్యగా ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరం, నోటి అల్సర్లకు ఉసిరికాయ మంచి ఔషధంగా పని చేస్తుంది.
చలికాలంలో ఉసిరిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భోజనం అయ్యాక ఉసిరిని తీసుకుంటే ఆరోగ్యకరమైన హృదయం మీ సొంతం అవుతుంది. రక్త పోటు, మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్న వారిలో గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది. అమైనో ఆమ్లాలు మరియు యాంటీ–ఆక్సిడెంట్ మూలకాలు గుండె పని తీరును మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. అయితే ఈ రెండూ ఉసిరి కాయలో పుష్కలంగా లభిస్తాయి.
మధుమేహం సమస్యతో రక్తంలో చక్కెర శాతం పెరిగి, ఇతర సమస్యలకు దారి తీస్తుంది. వేరే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నింటికీ ఉసిరి కాయ చక్కటి పరిష్కారంగా పని చేస్తుంది.
జీర్ణ సమస్యను దరిచేరనివ్వదు ఉసిరి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది. కడుపులో ఎసిడిటీ సమస్యను నివారిస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్న వారు తరచూ ఉసిరి కాయ తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఉసిరి కాలేయ పనితీరును అభివృద్ధి చేస్తుంది. ఉసిరి తరచూ తీసుకుంటే.. శరీరంలోని మలినాలు విష పూరిత మూలకాలు చెమట లేదా మూత్ర విసర్జన రూపంలో బయటకు పంపుతుందికొందరు ఉసిరి కాయను తినడానికి ఇష్ట పడరు. అలాంటి వారు ఉసిరిని జ్యూస్ రూపంలో తయారు చేసుకుని తాగొచ్చు. దీని వల్ల శరీరానికి విటమిన్–సి సమృద్ధిగా అందుతుంది. ఉసిరి తరచూ దొరకడం కష్టంగా ఉన్న వారు… వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎండలో ఆర బెట్టండి. ఇవి రోజుకు రెండు లేదా మూడు చప్పరించడం వల్ల శరీరంలో విష వ్యర్థాలను బయటకు పంపి మిమ్మల్ని ఆరోగ్య వంతంగా తయారు చేస్తుంది.