Health Benefits : శీతాకాలంలో తులసి ఆకులతో అద్భుతమైన ఉపయోగాలు… ఆ సమస్యలను చిటికలో తగ్గించుకోవచ్చు…!!
Health Benefits : చలికాలంలో అందరూ ఎన్నో వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. జలుబు, దగ్గు ఇంకా ఎన్నో రకాల వ్యాధులతో చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఆయుర్వేద నిపుణులు ప్రకారం తులసి ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ,యాంటీ ఫంగల్ మొదలైన లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పలు శారీరక సమస్యల నుంచి బయటపడేస్తుంది. తులసి ఆకులు వదలానికి అమృతంలా పనిచేస్తుంది. ఇది గుండెల్లో మంట అజీర్ణం లాంటి ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. ఈ తులసి మొక్కను మన హిందూ సాంప్రదాయాలు ఎంతో పవిత్రంగా కొలుస్తూ ఉంటారు. ఈ మొక్క ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దీనిని ఆరాధిస్తూ ఉంటారు. ఇక ఆయుర్వేదంలో దీనికి ఎంతో గొప్ప ప్రాధాన్యత ఉంది. దీని వలన కొన్ని వ్యాధులు తగ్గిపోతాయి..
అలాగే శరీరం పీహెచ్ లెవెల్స్ ను క్రమబద్ధీకరించడంలో గొప్పగా సహాయపడుతుంది. ఇక శీతాకాలంలో తులసి ఆకులతో బోలెడు ఉపయోగాలు ఉన్నాయి. నిత్యము ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకుల్ని తీసుకుంటే దగ్గు, జలుబు లాంటి సమస్యలు తగ్గిపోతాయి. గొంతు నొప్పి ,ముక్కు మూసుకుపోవడం అలాంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే తులసి ఆకులు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని కాళీ కడుపుతో తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్ రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. అలాగే గుండెపోటు లాంటి సమస్యలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసన తగ్గిస్తుంది: నోటి దుర్వాసన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తులసి ఆకులను నిత్యం నమిలి తీసుకోవాలి.
దీనిలో గుణాలు నోట్లోనే బ్యాక్టీరియాని చంపి నోటి దుర్వాసన తగ్గిస్తుంటాయి. ఉదర సమస్యలు దూరం: తులసి ఆకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన కడుపు సమస్యలు ఉండవు. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పొత్తికడుపు సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఈ ఆకులు ఎసిడిటీ, మలబద్దకం, ఆ జీర్ణం, పుల్లటి తేపులు లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.. చర్మ సంరక్షణకు : నిత్యం ఉదయం తులసి ఆకులను తీసుకోవడం వలన చర్మం మెరిసిపోతూ ఉంటుంది. తులసి ఆకులలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు చర్మం లోకి లోతుగా చర్చుకుపోయి శుభ్రం చేస్తూ ఉంటాయి. అలాగే మొటిమలు కూడా తగ్గిపోతాయి..