Amazing Health Benefits : ఇది పువ్వు కాదండోయ్… ఆరోగ్యానికి దివ్య ఔషధ చెన్నంగి… సీజనల్ వ్యాధులు దెబ్బకు పరార్…?
ప్రధానాంశాలు:
Amazing Health Benefits : ఇది పువ్వు కాదండోయ్... ఆరోగ్యానికి దివ్య ఔషధ చెన్నంగి... సీజనల్ వ్యాధులు దెబ్బకు పరార్...?
Amazing Health Benefits : ప్రస్తుతం ఎండలు మండాల్సిన సమయంలో, kasivinda plant వర్షాలు పడుతున్నాయి. ఎండాకాలం వర్షాకాలంలా ఉంది. ఇలాంటి అకాల వర్షాల కారణంగా, రీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలకు సీజనల్ వ్యాధుల భయం కూడా పట్టుకుంటుంది. చదువు కురియడంతో ఈ సీజన్లో దోమల బాధ పెరుగుతుంది. దోమలు, జ్వరాలు,జలుబు, దగ్గు, జ్వరం వంటి అంటూ వ్యాధులు ప్రభలే సీజన్ వర్షాకాలం. ఇటువంటి సమయంలో మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టేందుకు మన ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధమూలిక కలిగిన ఒక మొక్క ఉంది. ఒక మొక్క పేరే చెన్నంగి. దీనినే కసివింద అని కూడా అంటారు. మరో పేరు తంగేడు kasivinda plant. ఈ మొక్కలోని ప్రతి భాగం కూడా ఆరోగ్యానికి దివ్య ఔషధమే. చెన్నంగి చెట్టు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు… మరి ఈ తంగేడు పువ్వు ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం….

Amazing Health Benefits : ఇది పువ్వు కాదండోయ్… ఆరోగ్యానికి దివ్య ఔషధ చెన్నంగి… సీజనల్ వ్యాధులు దెబ్బకు పరార్…?
Amazing Health Benefits చెన్నంగి లేదా తంగేడు ఆరోగ్య ప్రయోజనాలు
చెన్నంగి.. దీనిని కసివింద అని కూడా పిలుస్తారు. ఈ మొక్క ఆకులతో పచ్చడి చేసుకొని తింటే నోటికి ఎంతో రుచిని అందిస్తుంది. కాదు జ్వరంతో నోటి రుచి కోల్పోయిన వారికి ఈ చట్నీ తిరిగి రుచి తెలిసేలా చేస్తుంది. నో ఔషధ గుణాలు కలిగిన ఈ చెన్నంగిలో చిన్న కసివింద, పెద్ద కసివింద అని రెండు రకాల చెట్లు ఉంటాయి. దీనిని చిన్న చిన్నంగి, పెద్ద చెన్నంగి అని కూడా పిలుస్తారు.
చిన్న చెన్నంగి ఉపయోగాలు : చిన్న చెన్నంగి ఉపయోగాలు కడుపులో ఉండే వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. కసివింద చెట్టు రసం చేదుగా ఉండి వేడిని కలిగిస్తుంది.ఈ చెట్టు గుణాలు వాతాన్ని, విషాన్ని హరించే శక్తి ఈ కసివింద చెట్టుకి ఉంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. గాయాలను,వ్రాణాలను, చర్మ రోగాలను నయం చేయటంలో ఈ మొక్క కీలకపాత్రను పోషిస్తుంది.
పెద్ద కసివింద చెట్టు ఉపయోగాలు : కసివింద చెట్టు ఆకులను వెన్నతో నూరి,చచ్చుబడిన పక్షవాత భాగాల పైన, ప్రతిరోజు మర్దన చేయటం వల్ల అవి పూర్వస్థితికి చేరుకుంటాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. కసివిందు ఆకులను,వేరు బెరడును ఎండబెట్టి పొడిగా చేసుకుని,తేనెను కలిపి లేపనంగా రాసుకోవడం వల్ల అనేక, రకాల చర్మవ్యాధులు గాయాలు వ్రాణాలు తగ్గుతాయట.
తంగేడు పువ్వు ఆరోగ్య ప్రయోజనాలు : తంగేడు ఒక పువ్వులను దంచి వస్త్రంలో వేసి రసాన్ని తీయాలి. ఆ తరువాత ఈ రసాన్ని ఒకటి లేదా రెండు చుక్కల పరిమాణంలో, కంటిలో వేసుకుంటే ఏడు రోజుల్లో రేచీకటి నయమవుతుంది. కసివింద గింజలను దోరగా వేయించి,పొడి చేసుకుని తగినన్ని పాలు,కండ చక్కెర కలిపి కాఫీలా తాగుతూ ఉంటే,మూత్ర సంబంధిత రోగాలు తగ్గుతాయి అంతేకాకుండా రక్తం కూడా శుద్ధి అవుతుంది. శరీరానికి ఏదైనా గాయం అయినప్పుడు ఆగకుండా రక్తస్రావం అవుతుంటే, ఈ సమయంలో ఈ చెట్టు ఆకులను దంచి కట్టుగా కట్టడం వల్ల గాయాల నుండి రక్తం స్రావం తగ్గుతుంది. ఇలా కసివింద చెట్టుతో మనం బోలెడు ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. కావున, ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకుండా ఇంటికి తెచ్చుకోవాలని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. వైద్యుల సలహా మేరకు ఈ మొక్కని వినియోగించండి.