Magnesium Oil : ఈ ఆయిల్ మీ పాదాలకు అప్లై చేస్తే… ఈ సమస్యకు చెక్… ఇంకా ఎన్నో లాభాలు…?
ప్రధానాంశాలు:
Magnesium Oil : ఈ ఆయిల్ మీ పాదాలకు అప్లై చేస్తే... ఈ సమస్యకు చెక్... ఇంకా ఎన్నో లాభాలు...?
Magnesium Oil : కొంతమందికి పడుకోగానే నిద్ర పట్టదు. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడతారు. ఇంకా మలబద్ధక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఈ చిట్కా మీకోసం ఓ అద్భుత పరిష్కారం కూడా అందిస్తుంది. అయితే, రాత్రి నిద్రపోయే ముందు మీ పాదాలకు మెగ్నీషియం ఆయిల్ రాస్తే చాలు.అద్భుతమైన గాఢనిద్ర మీకు అందించడమే కాకుండా, కండరాల నొప్పుల నుంచి,ఒత్తిడి నుంచి,జీర్ణ సమస్యల నుంచి చక్కటి ఉపశమనాన్ని అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇది ఒక మ్యాజికల్ ఆయిల్ దీన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా నిద్రించాలంటే ఈ మెగ్నీషియం ఆయిల్ ను పాదాలకి అప్లై చేయండి. ప్రశాంతమైన నిద్ర చాలా హాయిగా ఉంటుంది. చాలా సమస్యలను ఈ నిద్రే పరిష్కరిస్తుంది.కానీ ఆధునిక జీవనశైలిలో చాలామందికి నిద్రలేమి సమస్యగా మారింది. అలాంటి వారికి నిధులు ఒక అద్భుతమైన చిట్కాని సూచించారు. అదే రోజు నిద్రపోయే ముందు పాదాలకు మెగ్నీషియం ఆయిల్ రాస్తే,నిద్ర బాగా పడుతుంది.కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కండరాల తిమ్మిర్లు, ఒత్తిడి, మలబద్ధకం అంటే సమస్యలన్నీ కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు…

Magnesium Oil : ఈ ఆయిల్ మీ పాదాలకు అప్లై చేస్తే… ఈ సమస్యకు చెక్… ఇంకా ఎన్నో లాభాలు…?
Magnesium Oil నిద్రలేమి సమస్యకు పరిష్కారం
మెగ్నీషియం ఆయిల్ ను పాదాలకు రాసి మసాజ్ చేస్తే, నిద్ర నాణ్యత పెరుగుతుంది. మధ్యలో నిద్రకు ఎలాంటి అంతరాయం లేకుండా హాయిగా నిద్ర పడుతుంది. ఈ నూనె రాయగానే హార్మోన్ విడుదలవుతుంది.నిద్రను నియంత్రించే హార్మోను మెగ్నీషియం ఆయిల్ సరైన విధంగా ప్రభావితం చేస్తుంది. తద్వార,మెదడు శరీరం త్వరగా రిలాక్స్ అయ్యి ,బడలిక తగ్గే గాఢ నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది.
ఖండరాల నొప్పులకు ఉపశమనం : రోజంతా అలసిపోయి కండరాల నొప్పులతో బాధపడే వారికి, మెగ్నీషియం ఆయిల్ గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ నూనె రాసిన వెంటనే కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గి, నొప్పి తగ్గుతుంది. ముఖ్యంగా రాత్రిపూట వచ్చే కండరాల తిమ్మిర్లకు నరాల నొప్పులకు ఇది బాగా పనిచేస్తుంది. నెలసరి నొప్పులతో బాధపడే మహిళలకు కూడా దీనిని పాదాలకు అప్లై చేస్తే ఉపశమనం కలుగుతుంది. చర్మం ద్వారా కణాలలోకి ఇంకి కండరాలకు విశ్రాంతి ఇస్తుంది. నిద్రలో కండరాలు పట్టేయడం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది : ఇక ఒత్తిడితో సతమతమయ్యే వారికి సరిగ్గా నిద్ర పట్టదు. మెగ్నీషియం ఆయిల్ ను పాదాలకు అప్లై చేస్తే సెరటానిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఫీల్ గుడ్ హార్మోన్ గా పేరు పొందింది. సెరటానియన్ విడుదలైన నరాలు రిలాక్స్ అయ్యి, మెదడు నుంచి సానుకూల సంకేతాలను అందిస్తుంది. అంతేకాదు, ఒత్తిడికి కారణమయ్యే కాటిసాల్ హార్మోన్ల స్థాయిలను కూడా మెగ్నీషియం ఆయిల్ ను తగ్గిస్తుంది.ఫలితంగా ఆందోళన తగ్గి హాయిగా నిద్ర పడుతుంది.
మలబద్ధకం నివారణ : మెగ్నీషియం ఆయిల్ పాదాలకు రాస్తే నిద్ర సమస్య కాకుండా, మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. ఇది పెద్ద పేగు కండరాలలో కదలికలను ప్రోత్సహించి,మలవిసర్జన సజావుగా జరిగేలా చూస్తుంది. శరీరంలో మెగ్నీషియం స్థాయిలు పెరిగి జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.శరీరంలో టాక్సీలను బయటకు పంపించడంలో ఇది తోడ్పడుతుంది.
ఎలా ఉపయోగించాలి : మొదట మీ పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. తరువాత కాస్త తడిగా ఉన్నప్పుడే మెగ్నీషియం ఆయిల్ ను 5 నుంచి 10 సార్లు స్ప్రే చేయాలి. ముఖ్యంగా,మడమల దగ్గర ఎక్కువగా స్ప్రే చేయాలి. ఆ తర్వాత కనీసం మూడు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే రక్త ప్రసన్న మెరుగుపడుతుంది. ఇబ్బందిగా అనిపిస్తే ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. వేడి నీళ్లతో స్నానం చేసిన వెంటనే అప్లై చేసుకుంటే ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు.