Bathing : మీరు తలస్నానం చేసే విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే ఇక అంతే…!
ప్రధానాంశాలు:
Bathing : మీరు తలస్నానం చేసే విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే ఇక అంతే...!
Bathing : చాలామంది వాళ్లు చేసే పనిని బట్టి ప్రతిరోజు తలస్నానం చేస్తూ ఉంటారు.. కాలుష్యం నుంచి ఒత్తిడి నుంచి బయటపడడం కోసం చాలామంది తల స్నానం ప్రతిరోజు చేస్తూ ఉంటారు. అలా చేయడం వలన మంచి ప్రయోజనాలే ఉంటాయి. అయితే ఇలా ప్రతిరోజు తలస్నానం చేయడం మంచిదేనా.. వేడి నీటితో చేస్తే మంచిదా… చన్నీటితో చేస్తే మంచిదా ? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం చూద్దాం… మన జుట్టులో సహజమైన ఆయిల్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణను ఇచ్చి మెరిసేలా చేస్తుంటాయి. జుట్టును వేడి నీళ్లతో కడుక్కుంటే తలలోని సహజ ఆయిల్స్ ప్రభావితం అవుతాయి. దాంతో జుట్టు నిర్జీవంగా మారడం మొదలవుతుంది.
వేడి నీళ్లతో తలస్నానం చేయడం వలన జుట్టు చిట్లిపోవడం, పొడి బారడం, నిర్జీవంగా మారడం ప్రారంభమవుతుంది. తలపై చిరాకు చుండ్రు వస్తుంది. బాగా వేడి నీటితో తల స్నానం చేయడం వలన స్కాల్ప్ రంధ్రాలు తెరుచ్కొని జుట్టు మూలల్లో బలహీనమైతుంది. వేడినీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టులో ఉండే కెరాటే ప్రోటీన్ కరిగిపోయి జుట్టు డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇలా వేడి నీరు మన జుట్టుని ప్రభావితం చేస్తుంది. అయితే గోరువెచ్చని నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టుకి ఎటువంటి హాని జరగదు.. సహజంగా నీటి కంటే వేడి నీరు జుట్టు రంగ మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది.
వేడి నీరు జుట్టుకుదులను తెరిచేలా చేస్తాయి. దీనివల్ల రంగు కూడా పోతుంది. దానివల్ల జుట్టు రంగు చాలా త్వరగా రాలిపోతుంది. చలికాలంలో జుట్టులో చుండ్రు రావడానికి వేడి నీళ్లతో తలస్నానం చేయడమే ముఖ్య కారణం. వేడి నీళ్లతో తలస్నానం వల్ల చుండ్రు వస్తుంది. ఇది దురద, చుండ్రు సమస్యలను కలిగిస్తుంది. వేడినీరు తలకి రక్తప్రసరణ కూడా తగ్గిస్తుంది. దాని వలన జుట్టు మూలాలు బలహీన పడతాయి. జుట్టు రాలే ప్రమాదం ఎక్కువవుతుంది.. కావున వేసవికాలంలో చన్నీటీతో తలస్నానం చేస్తే జుట్టుకి ఎటువంటి హాని జరగదు.. ఇక శీతాకాలంలో గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు సమస్యల నుంచి బయటపడవచ్చు.