Bathing : వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకుంటే ఎంతో అదృష్టం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bathing : వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకుంటే ఎంతో అదృష్టం…!

 Authored By ramu | The Telugu News | Updated on :31 August 2024,11:33 am

ప్రధానాంశాలు:

  •  Bathing : వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకుంటే ఎంతో అదృష్టం...!

Bathing : ప్రతిరోజు స్నానం చేయడం అనేది మనిషి జీవితంలో సర్వసాధారణం. ప్రతిరోజు స్నానం చేయడం వలన శరీరం శుభ్రం అవడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో కొన్నింటిని కలిపి స్నానం చేయడం వలన ఆరోగ్యవంతులు అవడంతో పాటు ఐశ్వర్యవంతులు కూడా అవుతారని తెలియజేయడం జరిగింది. మరి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో ఏం కలిపితే మంచిది..?వాటి వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Bathing : తులసి ఆకులు…

ఆయుర్వేదంలో తులసి ఆకులకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాగే తులసి ఆకులలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. మరి ఇలాంటి దివ్య ఔషధమైన తులసి ఆకులను ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే ఒత్తిడి ఆందోళన తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక తులసి ఆకులతో స్నానం చేయడం వలన చర్మ సమస్యలన్ని దూరమవుతాయి. శరీరంలో నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీంతో జీవితాన్ని ఆహ్లాదకరంగా గడపవచ్చు.

Bathing పసుపు…

పసుపులో మన శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే పసుపుని యాంటీబయోటిక్ గా పిలుస్తుంటారు. అయితే పసుపుని నీటిలో కలిపి స్నానం చేయడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయట. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో పసుపు కలుపుకొని చేయడం వలన చర్మ సమస్యలతో పాటు నెగిటివ్ ఎనర్జీ అనేది దూరమవుతుందట. అంతేకాక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ విధంగా చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి దూరమవుతాయి.

Bathing లావెండర్ ఆయిల్..

స్నానం చేస్తే నీటిలో లావెండర్ ఆయిల్ కలిపి చేయడం వలన మానసిక ప్రశాంతత పెరిగి నెగటివ్ ఆలోచనలు అనేవి తగ్గిపోతాయట. అలాగే స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసుకోవడం వలన గ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలిగిపోతాయి.

Bathing వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకుంటే ఎంతో అదృష్టం

Bathing : వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకుంటే ఎంతో అదృష్టం…!

గులాబీ రేకులు…

ప్రతిరోజు మనం స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు కలిపి చేయడం వలన జీవితంలో శాంతి అనేది పెరుగుతుంది. అంతేకాక చర్మ సౌందర్యం పెరిగి ప్రకాశవంతంగా యవ్వనంగా కనిపిస్తారు. అలాగే దీనిలో కాస్త తేనె కలిపి స్నానం చేసినట్లయితే ఆర్థిక సంక్షోభాల నుంచి కూడా బయటపడతారని నిపుణులు చెబుతున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది