Eye Care : కళ్ళకి కాటుక పెట్టుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ కళ్ళు ప్రమాదంలో పడినట్లే…!!
Eye Care : కాటుక పెట్టుకుంటే ఎలాంటి కళ్ళు అయిన సరే అందంగా కనిపిస్తాయి. ఎంత చిన్నవైనా సరే రవ్వంత కాటుక పూసుకుంటే ఎంతో పెద్దవిగా అందంగా కనిపిస్తాయి. అయితే కాటుక పెట్టుకోవడం వల్ల కళ్ళు అందంగా మాత్రమే కాదు. ఈ కాటుక వల్ల కళ్ళకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటంటే దుమ్ముదులి ప్రభావాలనుంచి కాటుక కంటిని కాపాడమే కాదు.. కళ్ళను తాజాగా మెరిసేలా చేస్తుంది. కాటుక కంటికి చలువ చేస్తుందని ఆయుర్వేదము చెబుతోంది. అయితే […]
Eye Care : కాటుక పెట్టుకుంటే ఎలాంటి కళ్ళు అయిన సరే అందంగా కనిపిస్తాయి. ఎంత చిన్నవైనా సరే రవ్వంత కాటుక పూసుకుంటే ఎంతో పెద్దవిగా అందంగా కనిపిస్తాయి. అయితే కాటుక పెట్టుకోవడం వల్ల కళ్ళు అందంగా మాత్రమే కాదు. ఈ కాటుక వల్ల కళ్ళకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటంటే దుమ్ముదులి ప్రభావాలనుంచి కాటుక కంటిని కాపాడమే కాదు.. కళ్ళను తాజాగా మెరిసేలా చేస్తుంది. కాటుక కంటికి చలువ చేస్తుందని ఆయుర్వేదము చెబుతోంది. అయితే కాటుక పెట్టుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. కాటుక పెట్టుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.. కాటుక పెట్టుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి కళ్ళపై తడి లేకుండా తుడుచుకొని కాటుక పెట్టుకోవాలి.
దీనివల్ల చెమట పట్టడం తగ్గి పెట్టిన కాటుక చెదరకుండా అందంగా ఉండేలా కనిపిస్తుంది. కాటుక పెట్టుకునే ముందు మెత్తని వస్త్రంతో కనురెప్పను తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల కనురెప్పలపై ఉంటే జిడ్డు పూర్తిగా తొలగిపోయి కళ్ళు తాజాగా ఉంటాయి. కనురెప్పల మధ్యన కాటుక పెట్టుకోవాలి. కాటుక పెట్టుకునే ముందు కళ్ళకి లైట్ కలర్ ఐ షాడో బేస్ గా వేసుకున్న కాటుక చెదిరిపోకుండా ఉంటుంది. కళ్ళకు నాణ్యమైన కాటుకే వాడాలి. అప్పుడే కళ్ళు అందంగానో ఆరోగ్యంగానే ఉంటాయి. కాగా కాటుక వాడినప్పుడు దురద పెట్టడం కళ్ళు మంట పుట్టడం అంటే లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ కాటుక వాడడం ఆపేయాలి..
ఎన్నో ఉపయోగాలున్న కాటుక పెట్టుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాత్రి పడుకునే సమయంలో కాటుకను శుభ్రం చేసుకుని పడుకోవాలి. లేదంటే కళ్ళ చుట్టూ ఉండే చర్మం లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది.. ఎందుకంటే ఈ కాటుకలో లేడ్ ఆక్సైడ్ లాంటి పదార్థాలను వినియోగిస్తారు. వీటిని శుభ్రం చేయకపోతే డార్క్ సర్కిల్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.. కాటుక పెట్టుకునేటప్పుడు కొద్దిగా అటు ఇటు అవుతుంది. అయితే కొంతమంది నొక్కి కళ్ళ కింద భాగాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. అలా అస్సలు ఎప్పుడు చేయకూడదు. దాని వలన కళ్ళు పాడయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కళ్ళ చుట్టూ ఉండే చర్మం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది.. కాబట్టి కాటుక పెట్టుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..