Beauty Tips : ఆలుతో ఫేస్ మాస్క్.. ఇవి కలిపి వేసుకుంటే మెరిసిపోయే అందం..
Helth Tips : బంగాళాదుంప (ఆలుగడ్డ) తినడానికే కాదు.. ముఖముపై మొటిమలు.. కాంతివంతంగా కావాలంటే ఫెషియల్ కూడా రెడీ చేసుకోవచ్చు. అందుకే తినడానికి మాత్రమే పనికి వస్తుందని అనుకోకండి. బంగాళాదుంప మహిళల అందానికి కూడా ఉపయోగపడుతుంది. ఫంక్షన్లకి పార్టీలకి వెళ్లాలంటే లేడీస్ వెంటనే బ్యూటీ పార్లర్ వైపు పరిగెడుతుంటారు. అయినా కూడా వెంటనే ఫలితం ఉండదు. దీంతో నిరాశపడతారు. అలాంటి సమస్య లేకుండా ఇంట్లే ఫేషియల్ మాస్క్ రెడీ చేసుకుని నిగనిగలాడే కాంతివంతమైన మొఖాన్ని సొంతం చేసుకోవచ్చు.
బంగాళదుంపలో ఉండే విటమిన్ బీ , సీ లు మరియు స్ట్రార్చ్ కూడా చర్మ రంగును కాంతివంతంగా మార్చుతాయి. కళ్ల క్రింది చర్మంను కాపాడి, నల్లటి వలయాలను నివారిస్తాయి. కంటి చుట్టూ ఏర్పడే నల్లటి మచ్చలకు ఆలు రసాన్ని పట్టిస్తే మంచి ఫలితముంటుంది. ఆలును స్లైసుగా కోసి తరచూ మొహానికి అప్లై చేస్తుంటే చర్మపు మడతలు తగ్గుతాయి. బంగాళదుంపను మెత్తగా రుబ్బి రసం తీయాలి. ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. యాక్నె వల్ల అయిన మచ్చలు కూడా తొలగిపోతాయి.
బంగాలదుంపను కడిగి తురుముకుని రసం తీయాలి. ఈరసానికి ఒక కప్ కాఫీ పొడి, స్పూన్ టమాటో రసం, నిమ్మరసం కొన్ని డ్రాప్స్ వేసుకోవాలి. అలాగే ఎవర్ యూత్ ఫీల్ ఆఫ్ మాస్క్ చిన్న ప్యాకెట్ ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ముఖానికి కోటింగ్ వేసుకోవాలి. ఆరిన తర్వాత మాస్క తీసివేయాలి. దీంతో ముఖంపై బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్ తొలగిపోయి కాంతివంతంగా తయారు అవుతుంది. రెగ్యూలర్ గా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.