Beauty Tips : ఈ ప్యాక్ ని ఒక్కసారి వాడితే చాలు… మీ ముఖం పై ఉన్న ఎన్నో రకాల సమస్యలు అన్నిటికీ చెక్ పెట్టవచ్చు…!
Beauty Tips : చాలామందికి ముఖంపై ఓపెన్ ఫోర్స్, అవాంచిత రోమాలు, మచ్చలు, మొటిమలు ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని నివారించుకోవడానికి ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న క్రీమ్స్ ను వాడుతూ ఉంటారు. అయితే అలాంటి వారికి ఇప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకునే ప్యాక్ ని సంతోషంగా వాడుకోవచ్చు. ఈ ప్యాక్ వాడుకోవడం వలన చర్మంపై ఉన్న మృతుకణాలు పోతాయి. అలాగే చర్మంపై ఉన్న రంధ్రాలు కూడా మూసుకుపోతాయి. అదేవిధంగా చర్మంపై ఉన్న అవాంచిత రోమాలు కూడా తొలగిపోతాయి. దీనిలో వాడేవి మనకి ప్రకృతి సిద్ధంగా దొరికేవి కావున ఈ ప్యాక్ ని వినియోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. కావున దీనిని ఎవరైనా వాడుకోవచ్చు.
ఇప్పుడు ఈ ప్యాక్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం చూద్దాం.. ఈ ప్యాక్ కోసం ముందుగా ఒక టమాట తీసుకొని దాని ముక్కలుగా చేసి దానిలో ఉన్న గుజ్జు మరియు గింజల్ని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఏడు చుక్కల నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఆ తదుపరి కస్తూరి పసుపు ఒక హాఫ్ స్పూను వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి అందులో ఒక చెంచా మనం వినియోగించి ఏదైనా కాపీ పౌడర్ వేయాలి. ఇది మొత్తం బాగా కలిపి అందులో ఆరెంజ్ ఫీల్ ఆఫ్ మాస్క్ లేదా అలివేరా జెల్ ఫీల్ ఆఫ్ మాస్కుని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ప్యాక్ ని ఏ విధంగా వాడుకోవాలో. ఇప్పుడు చూద్దాం దానికోసం ముందుగా మనం ఫేస్ని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఆ తదుపరి మన ముఖంపై మనం తయారు చేసుకున్న ప్యాక్ ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. అలా వేసేటప్పుడు సమానంగా వేసుకోవాలి. ఆ విధంగా అప్లై చేసిన తదుపరి 15 నిమిషాలు పాటు ఈ ప్యాక్ ని బాగా ఆరనివ్వాలి. ప్యాక్ ఆరిన తర్వాత ఒక గ్లస్సిగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తదుపరి ఈ ప్యాక్ పైనుంచి కిందికి ఫీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన ముఖంపై ఉన్న వైట్ అండ్ బ్లాక్ హెడ్స్ పోతాయి. అలాగే చర్మం టైట్ గా అవుతుంది. అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి. దీనిలో వాడిన నిమ్మరసం అలాగే టమాట జ్యూస్ ఫేస్ పై బ్లీచ్ లాగా సహాయపడుతుంది. కావున చర్మంపై ఉన్న మృతుకనాలు తొలగిపోతాయి. అదేవిధంగా చర్మం మెరిసిపోతూ ఉంటుంది.