Beauty Tips : ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చర్మం నల్లగా అయిపోతుందని బాధపడుతున్నారా… అయితే ఒక్కసారి ఈ చిట్కాను ట్రై చేయండి….!
Beauty Tips : ప్రస్తుత కాలంలో చాలామంది వారి తొడలు, గజ్జలు , చంకలు, మెడ వంటి భాగాల్లో నల్లగా అయిపోతుంది అని బాధపడుతుంటారు. ఇలా ఉండటం వలన కొన్ని రకాల బట్టలు వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక అమ్మాయిలైతే హ్యాండ్స్ లెస్ డ్రెస్ లు వేసుకోలేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అయితే కొంతమంది వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ను వినియోగిస్తున్నారు. కానీ వాటిలోని రకరకాల కెమికల్స్ వలన చర్మ వ్యాధులకు గురవుతున్నారు. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ గా ఇంట్లో దొరికే పదార్థాలతో చంకలు , గజ్జలు, తొడలు , మధ్య వచ్చే నలుపును ఈజీగా ఎలా పోగొట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక చెంచా మిల్క్ పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిల్క్ పౌడర్ చర్మం పైన నలుపుని పోగొట్టి చర్మం తెల్లగా అయ్యేందుకు సహాయపడుతుంది. తర్వాత దీనిలో ఒక చెంచా వైట్ పేస్టు వేసుకోవాలి. కోల్గేట్ పేస్ట్ ను ఉపయోగించడం మంచిది. ఈ పేస్టు చర్మంపై పేరుకుపోయిన నలుపును పోగొట్టడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఆ తర్వాత దీనిలో ఒక అర చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. నిమ్మరసం ఆంటీ అసిస్టెంట్ ను కలిగి ఉంటుంది కాబట్టి చర్మ వ్యాధులు రాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఈ నిమ్మకాయ పని చేస్తుంది. ఆ తర్వాత దీనిలో ఒక చెంచా బేకింగ్ సోడాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇలా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని తొడలు , గజ్జలు, సంక భాగాలలో నల్లగా అయిన చోట అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత నిమ్మ చెక్కతో కాసేపు స్క్రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడుకోవాలి. ఇలా చేయడం ద్వారా తొడలు, గజ్జలు, సంకల్లో ఉన్న నలుపు పోతుంది. అలాగే దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. ఒకసారి ఈ చిట్కా ను ట్రై చుసి చూడండి కచ్చితంగా 100% రిజల్ట్ ను పొందుతారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు , వాటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ను వినియోగించేవారు ఒక్కసారి ఈ చిట్కాను వాడి చూడండి.