Chicken Bones : చికెన్ బోన్స్ ఎక్కువగా తింటే ఏమవుతుంది..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
ప్రధానాంశాలు:
Chicken Bones : చికెన్ బోన్స్ ఎక్కువగా తింటే ఏమవుతుంది..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
Chicken Bones : ప్రస్తుత కాలంలో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా తినే మాంసంలో చికెన్ ఒకటని చెప్పాలి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చికెన్ చాలా ఇష్టంగా తింటారు. అలాగే కొంతమంది చికెన్ బోన్స్ ను కూడా ఎంతో అమితంగా ఇష్టపడుతుంటారు. మరి చికెన్ మూలగలు తినడం మంచిదేనా. చికెన్ బోన్స్ తింటే నష్టాలు ఏమైనా ఉన్నాయా…మరి ఈ విషయంపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
సాధారణంగా ఆదివారం వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చికెన్ వండుతారు. ఈ నేపథ్యంలోనే కొందరు బోన్ చికెన్ తీసుకుంటే మరి కొందరు బోన్ లెస్ చికెన్ తీసుకుంటూ ఉంటారు. అయితే చికెన్ బోన్స్ తినడం మంచిదేనా అంటే అవును అంటున్నారు నిపుణులు. కానీ బ్రాయిలర్ చికెన్ బోన్స్ కాదట. ఎందుకంటే ప్రస్తుత కాలంలో బ్రాయిలర్ కోళ్లను ఇంజక్షన్స్ కెమికల్స్ ఉపయోగించి పెంచుతున్నారు. కావున బ్రాయిలర్ కోళ్ల బోన్స్ తినడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కానీ నాటుకోడి బోన్స్ మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదట. నాటుకోడి బోన్స్ లో కొల్లాజన్, కంజుగెటెడ్ లెనో లెయిన్ యాసిడ్ , గ్లైసిన్,గ్లూకోసమైన్ వంటి సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో నొప్పులు వాపులు వంటివి తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాక చర్మ ఆరోగ్యానికి కూడా ఇది ఎంతగానో దోహాద పడతాయని నిపుణులు చేబుతున్నారు. ఇక నాటుకోడి చికెన్ బోన్స్ లో జింక్, ఐరన్ ,కాల్షియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన మంచి పోషకాలు అందిస్తాయి. కావున నాటుకోడికి చెందిన బోన్ తినడం చాలా మంచిదని ఇది శరీరానికి ఎంతగానో దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.