Sandalwood : గంధం తో కూడా ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు… ఎలాగంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sandalwood : గంధం తో కూడా ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు… ఎలాగంటే…!

Sandalwood : ప్రతిఒక్కరికి మెరిసే అందమైన చర్మం కావాలి అనుకోవటం సహజం. కానీ వాతావరణం లో మార్పుల వలన చర్మం అనేది నిర్జీవంగా తయారవుతుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యతో బాధపడే వాళ్ళు అసలు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మీ ఇంట్లో ఉండే గంధం మీ అందాన్ని రెట్టింపు చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ గంధం అనేది చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. దీనిలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 October 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Sandalwood : గంధం తో కూడా ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు... ఎలాగంటే...!

Sandalwood : ప్రతిఒక్కరికి మెరిసే అందమైన చర్మం కావాలి అనుకోవటం సహజం. కానీ వాతావరణం లో మార్పుల వలన చర్మం అనేది నిర్జీవంగా తయారవుతుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యతో బాధపడే వాళ్ళు అసలు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మీ ఇంట్లో ఉండే గంధం మీ అందాన్ని రెట్టింపు చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ గంధం అనేది చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టంతో కూడా పోరాడుతుంది. అలాగే ముడతలు మరియు గీతాలు పడకుండా కూడా చూస్తుంది. ఈ గంధం అనేది స్కిన్ యొక్క టోన్ ను ఎంతో మెరుగుపరుస్తుంది. అలాగే చర్మ వ్యాధులకు చికిత్స కూడా చేస్తుంది. అంతేకాక చర్మంలో పేరుకుపోయిన మలినాలను కూడా తొలగిస్తుంది. అలాగే చర్మాన్ని ఎంతో మృదువుగా కూడా మారుస్తుంది…

ప్రతి ఒక్కరి ఇంటిలో ఎంతో సులభంగా దొరికే గంధాన్ని వాడడం వలన జిడ్డు చర్మాన్ని తొలగించి మెరిసే చర్మాన్ని వేగంగా పొందవచ్చు. దీనికోసం ముందుగా ఒక చెంచా గంధం పొడిని గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు దానిలో చిటికెడు పసుపు మరియు పచ్చి పాలు పోసి చక్కటి పేస్టులా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు తయారు చేసుకునటువంటి ఫేస్ ప్యాక్ ను ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకొని 15 నుండి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అది బాగా ఆరిన తర్వాత. నీటిని చిలకరించి పేస్ ప్యాక్ ను తీసేందుకు మెల్లగా స్క్రబ్ చేయాలి…

Sandalwood గంధం తో కూడా ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు ఎలాగంటే

Sandalwood : గంధం తో కూడా ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు… ఎలాగంటే…!

ముఖానికి గంధం పొడిని వాడటం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ఈ గంధపు ఫేస్ ప్యాక్ తో మీ ముఖం పై ఉన్న జిడ్డు మరియు మచ్చలను కూడా తొలగించవచ్చు. మీరు ఇలా చేస్తే మీ చర్మం తొందరగా మెరుస్తుంది. అలాగే ఇది ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించదు. దీనికోసం ఒకటిన్నర స్పూన్ గంధం పొడి మరియు రెండు టీ స్పూన్ల సెనగపిండి, చిటికెడు పసుపు, రోజ్ వాటర్ తో కూడా మీరు ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఫెస్ట్ లా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా అప్లై చేసుకోండి. తరువాత కొద్దిసేపు దానిని ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోండి. ఇది మీ ట్యాన్ తొలగించడానికి మరియు చర్మం యొక్క ఛాయను పెంచడానికి ఎంతో అద్భుతంగా పని చేస్తుంది…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది