Nuts Soap : చూడడానికి చిన్నగానే ఉంటుంది… కానీ లాభాలు ఎన్నో.. ముఖ్యంగా ఆ సమస్యలకు…!
Nuts Soap : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా షాంపులను ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఒకప్పుడు కుంకుడు కాయలనే వాడేవారు. ఇప్పుడు మాత్రం కుంకుడు కాయలకు బదులుగా షాంపులను వాడుతున్నారు. అందువలన జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుంది. ఎన్ని షాంపులు వాడినా సరే చుండ్రు అనేది అసలు తగ్గటం లేదు అని ఇలాంటి మాటలను ప్రతి ఒక్కరూ అంటుంటే మనం వింటూనే ఉన్నాం. ప్రస్తుత కాలంలో ఎంతో మంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక ముఖంపై మొటిమల సంగతి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే వీటన్నిటికీ పరిష్కారం కూడా ఖరీదైన షాంపూలు మరియు క్రిములు కాదు. మన పూర్వికులు వాడినటువంటి కుంకుడుకాయలో ఉంది అని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మరి ఈసారి వాటితో తల స్నానం చేసి చూడండి. ఫలితం అనేది మీకే కనిపిస్తుంది..
కుంకుడు కాయలో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాల వలన చుండ్రు సమస్య అనేది తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది. అయితే దానిని నేరుగా వాడే బదులుగా కాసిన్ని మందర ఆకులను కలిపి తలస్నానం చేయండి. ఫలితం అనేది మీకే తెలుస్తుంది. కుంకుడు కాయలో యాంటీ అలర్జీ,యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు అనేవి అధికంగా ఉన్నాయి. అందువలన చర్మానికి క్లేన్సర్ గాను ఉపయోగించవచ్చు. మొటిమలు వాటి తాలూకు మచ్చలు అనేవి కూడా దూరం అవుతాయి. దీనికోసం కొంకుడుకాయ రసంలో ముంచిన దూదితో ముఖాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. క్రమంగా మీ సమస్య అనేది దూరం అవుతుంది. కాలుష్యం ఇతరత్రా సమస్యలు ఈ రోజులలో జుట్టు రాలడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఈ ఇబ్బందికి చెక్ పెట్టేందుకు కుంకుడుకాయ రసం చక్కటి పరిష్కారం అని చెబుతున్నారు నిపుణులు.
వాటిని రెండు మూడు గంటలకు ముందుగానే నానబెట్టుకొని దాని నుండి రసం తీసి దానిలో పావు కప్పు కలబంద గుజ్జును కూడా కలుపుకొని తలకు అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ఐదు నిమిషాలు రుద్దుకోని తల స్నానం చేసినట్లయితే మాడ నుండి చివరి వరకు పట్టిన మురికితో పాటు రసాయనాల తాలూకు ప్రభావం కూడా వదిలిపోతుంది. ఎంతోమంది ముఖంపై చూపే శ్రద్ధ పాదాలపై చూపించరు. దీంతో అవి కాంతి హీనంగా తయారవుతాయి. గోళ్లు,మడమలు మురికిగా కూడా తయారవుతాయి. వీటిని క్లీన్ చేసేందుకు కూడా కుంకుడుకాయ రసంలో కాస్త గులాబీ నీరు చేర్చుకునే 10 నిమిషాలు నానబెట్టాలి. దాని తర్వాత కొబ్బరి పీచు ను తీసుకోని మృదువుగా రుద్దుకోవాలి. టాన్, డెడ్ స్కిన్ అనేది వదిలిపోవడంతో పాటు పాదాలు అనేవి ఎంతో కోమలంగా కూడా ఉంటాయి…