Black Tea : బ్లాక్ టి VS బ్లాక్ కాఫీ ఏది తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి…!
Black Tea : సహజంగా అందరూ టీ కాఫీలను ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. మరికొందరైతే ఉదయం లేవగానే టీ తాగకపోతే ఏ పనిని మొదలుపెట్టరు.. ఒక కప్పు టీ తాగగానే ఎంతో యాక్టివ్గా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు.. టీ కాఫీలలో ఉండే కేఫిన్ అనే పదార్థం నరాలను ఉత్తేజ పరుస్తుంది. కావున ఒక కప్పు టీ కాఫీ తాగినట్లయితే వెంటనే శరీరానికి ఉత్సాహం అనేది వస్తుంది.. అయితే ఆరోగ్యం పై దృష్టి ఎక్కువగా ఉన్నవారు కాఫీ […]

Black Tea : సహజంగా అందరూ టీ కాఫీలను ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. మరికొందరైతే ఉదయం లేవగానే టీ తాగకపోతే ఏ పనిని మొదలుపెట్టరు.. ఒక కప్పు టీ తాగగానే ఎంతో యాక్టివ్గా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు.. టీ కాఫీలలో ఉండే కేఫిన్ అనే పదార్థం నరాలను ఉత్తేజ పరుస్తుంది. కావున ఒక కప్పు టీ కాఫీ తాగినట్లయితే వెంటనే శరీరానికి ఉత్సాహం అనేది వస్తుంది.. అయితే ఆరోగ్యం పై దృష్టి ఎక్కువగా ఉన్నవారు కాఫీ టీ లకు దూరంగా ఉంటారు. వాటి బదులుగా బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ లను తాగుతూ ఉంటారు.. అయితే ఈ బ్లాక్ కాఫీ బ్లాక్ టీ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఈ రెండు పానీయాలలో ఏది మంచిది అనే విషయాలు చాలా మందికి తెలియదు.. ఈ రెండు పానీయాలలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి ఉపయోగపడతాయి..
ఈ రెండు పానీయాలలో దీనిలో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం…
బ్లాక్ టీ లో పోషకాలు అధికంగా ఉంటాయి. కెఫిన్ తక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.. ఈ బ్లాక్ కాఫీలో కేఫిన్ అధికంగా ఉండడం వలన వెంటనే శక్తి వస్తుంది. వ్యాయామం లేదా వ్యాయామానికి మునుపు ఎనర్జీ లెవెల్స్ ను పెంచుకోవడానికి దీనిని తీసుకోవచ్చు. అలాగే జిమ్ కెళ్లే వాళ్లు ఎక్కువగా బ్లాక్ కాఫీ ని తీసుకుంటూ ఉంటారు. బ్లాక్ కాఫీ కంటే బ్లాక్ టీ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.. బ్లాక్ టీ లో ఫ్లేవనాయిడ్స్ ,పాలి పెనాల్సి లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎన్నో ప్రాణాంతకర జబ్బులతో పోరాడడానికి ఉపయోగపడతాయి. బ్లాక్ కాఫీలో కేఫిన్ అధికంగా ఉంటుంది. ఇది చాలామందికి ప్రమాదకరం బ్లాక్ టీ లో కేఫిన్ చాలా తక్కువ లెవెల్స్ ఉంటాయి..
బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ ఈ రెండు పానీయాలలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి ఉపయోగపడతాయి. అయితే బ్లాక్ టీలో కనిపించే యాంటీ ఆక్సిడెంట్లు బ్లాక్ కాఫీ కంటే చాలా ప్రభావితంగా పనిచేస్తాయి.. అయితే ఈ రెండు పానీయాలు మంచిదైనప్పటికీ ఏ టీ ఆర్ కాఫీని ఎక్కువగా తాగిన ఆరోగ్యానికి మంచిది కాదు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..ఏ టీ అయినా ఒక కప్పు రెండు కప్పులు మించి తాగితే అనారోగ్య సమస్యలు తప్పవు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..