Boiled Rice Water : అన్నం వండగా వచ్చిన గంజితో … ఈ వ్యాధులను నయం చేస్తుందంట…?
ప్రధానాంశాలు:
Boiled Rice Water : అన్నం వండగా వచ్చిన గంజితో ... ఈ వ్యాధులను నయం చేస్తుందంట...?
Boiled Rice Water : మన పూర్వకాలములో అన్నము వండిన నీరు, అంటే గంజి, అన్నం వండుతున్నప్పుడు గంజిని తీస్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా కొంతమంది అలా గంజిని తీస్తూనే ఉంటారు. అలా అన్నం వండుతున్నప్పుడు వచ్చిన గంజిని తాగడం వల్ల మన శరీరంలో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. శరీరంలోని విషపూరితలను కూడా తొలగిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగు పరుస్తూ అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అలాగే స్థూలకాయత్వాన్ని కూడా తగ్గిస్తుంది. అన్నం వండిన నీటితో ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఎక్కువ అధిక బరువుతో బాధపడుతున్నారా…? ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా బరువు తగ్గడం లేదా… ఇటువంటి పరిస్థితుల్లో మీరు కచ్చితంగా ఇలా వండిన అన్నం నీటిని తాగండి. త్వరగా బరువు తగ్గిపోతారు. అన్నం శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. దీన్ని మరిగించిన తర్వాత బయటకు వచ్చే నీరు అంటే గంజి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్న నిపుణులు చెబుతున్నారు. ఉబకాయాన్ని తగ్గించుకోవాలనుకున్నప్పుడు, దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అయితే దీనివల్ల కలిగే ప్రయోజనాలు చాలామందికి తెలియదు. ఉడకబెట్టిన అన్నం నుంచి వచ్చిన నీరు లేదా గంజి శరీరంలోని విషపూరిత అంశాలను సులభంగా బయటికి పంపిస్తాయి. తద్వారా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఈ ఒక్కటే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అన్నం వండిన నీరు ఆరోగ్యాన్ని,స్థూలకాయత్వాన్ని ఎలా తగ్గిస్తుందో తెలుసుకుందాం..
ఉడికించిన అన్నం నీటిలో ఫైబర్ చాలా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే కడుపులో మంచి బ్యాక్టీరియాలను సక్రీయం చేస్తుంది. డైటీషియన్లు పోషకాహార నిపుణులు,ప్రకారం బియ్యం నీటిలో 75-80% స్టార్చ్ ఉంటుంది. విటమిన్ ఇ, ఆమైనో ను ఆమ్లాలు, విటమిన్ బి, ఫైబర్, జింక్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, మాగాణిసులు కూడా ఉంటాయి.
ఇవి ఆరోగ్యానికి చర్మానికి మరియు జుట్టుకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్ పొట్ట ఆరోగ్యానికి అవసరమైన ప్రోబయోటిక్స్ ను సమతుల్యం చేస్తాయి.
Boiled Rice Water ఉబకాయం -బరువు నష్టం
ఉడకబెట్టిన అన్నంలోని నీరు శరీరంలోని నిర్జలీకరణాన్ని అనుమతించదు. చాలా తేలికైనది, దీనివల్ల బరువు తగ్గడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల కొవ్వు తగ్గుతుంది. ఉబకాయం కూడా తగ్గుతుంది. కడుపు సంబంధించిన సమస్యలకు ఇది ఒక దివ్య ఔషధం. అజీర్ణం, విరోచనాలు, వాంతులు అంటే సమస్యల నుంచి కూడా వెంటనే ఉపశమనాన్ని పొందవచ్చు.
ఉబకాయoని, బరువుని తగ్గించుకోవాలని అనుకునేవారు అన్నం ఉడికించిన నీళ్లను తాగండి. దీనిలో కేలరీల పరిమాణం చాలా తక్కువ ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వులను తొలగిస్తుంది. దీనికోసం అన్నం వండేటప్పుడు ఎక్కువ నీటిని కలిపి, వండిన తర్వాత వచ్చిన గంజిని వడకట్టి చల్లార్చి తాగాలి. దీన్ని తాగితే బరువు ఈజీగా తగ్గవచ్చు. బరువు తగ్గాలనే వారికి ఇది ఒక దివ్య ఔషధం.