Health Benefits : ఒక్క గ్లాస్ తాగితే వంద లాభాలను మీ సొంతం చేసే జ్యూస్..!
Health Benefits : ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు కూడా లావుగా మారిపోతున్నారు. ఆహారపు అలవాట్ల వల్లే చాలా మంది లావుగా అవుతున్నారు. అయితే ఆ బరువును తగ్గించుకునేందుకు జిమ్ ల చుట్టూ తిరుగుతుంటారు. అయితే అవేం అవసరం లేకుండా సులువుగా ఇంట్లోనే ఈ చిట్కాలతో బరువు తగ్గొచ్చు. మీరు బరువు తగ్గాలని అనుకుంటే మీ రోజువారి ఆహారంలో లేత సొరకాయను చేర్చుకోవాలి. సొరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే సులభంగా లభించే కూరగాయ కూడా. సొరకాయ కూరగాయగా.. సూప్, జ్యూస్ రూపంలో బరువు తగ్గడంలో సాయపడుతుంది. సొరకాయలో విటామిన్ బి, పీచు పదార్థాలతో పాటు నీరు పుష్కలంగా లభిస్తుంది. అయితే సొరకాయ శరీరం యొక్క జీవక్రియ రేటును పెంచడంలో సాయపడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.
అంతే కాకుండా ఈ కూరగాయ యొక్క గొప్పదనం ఏమిటంటే… ఇది మీ ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అంతే కాకుండా సొరకాయ జ్యూస్ తాగడం వల్ల వేగంగా బరువు తగ్గొచ్చు.సొరకాయలో ఉండే విటామిన్ బి, ఫైబర్ మరియు నీరు మంచి మొత్తంలో ఉంటాయి. అలాగే సొరకాయలో సంతృప్త కొవ్వు మరియు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇందులో విటామిన్ బి, సి, ఎ, కె, ఇ, ఫోలెట్, ఐరన్, మెగ్నీషియం మరియు పొటాషియం కూడా ఉన్నాయి. పొట్లకాయ రసం తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు రోజంతా చాలా యాక్టివ్ గా ఉండొచ్చు. మధుమేహం, కొలెస్ట్రాల్ ఉన్న రోగులకు సొరకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అయితే మీ ఆరోగ్యానికి ఇంత మేలు చేసే సొరకాయ జ్యూస్ తయారు చేసుకోవడం ఎలాగో మనం ఇఫ్పుడు తెలుసుకుందాం.ముందుగా తాజా సొరకాయను తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కులుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని జ్యూసర్ గ్రైండర్ లో వేసి రసాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఆ రసాన్ని మొత్తం ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి. మీ రుచికి అనుగుణంగా నిమ్మరసం, నల్ల ఉప్పును కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న సొరకాయ జ్యూస్ ని ప్రతిరోజూ తాగడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు. ఇది శరీరంలో ఉండే చక్కెర, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో మీకు సాయపడుతుంది. అందుకే వీలయినంత ఎక్కువగా పొట్ల కాయ లేదా సొరకాయ జ్యూస్ ను రోజూ తాగండి.