Brown Bread : బ్రౌన్ బ్రెడ్ తింటే శరీరానికి ఎన్ని ఉపయోగాలు తెలుసా…?
ప్రధానాంశాలు:
Brown Bread : బ్రౌన్ బ్రెడ్ తింటే శరీరానికి ఎన్ని ఉపయోగాలు తెలుసా...?
Brown Bread : గోధుమలతోతయారుచేసిన బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ తినడం వల్ల శరీరానికి అవసరమైన న్యూట్రిన్లు అందుతాయి. ఈ బ్రెడ్ స్లైసెస్ ను సాయంత్రం పూట స్నాక్స్ మాదిరి తీసుకున్న ఆరోగ్యపరంగా ఎదురయ్యే కొన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ ని చాలామంది బ్రేక్ ఫాస్ట్ మాదిరిగా కూడా తీసుకుంటూ ఉంటారు. బ్రౌన్ బ్రెడ్ లో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ బ్రెడ్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే తక్కువ శాతం గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి.
అలాగే మొత్తంగా గోధుమలతో తయారు చేసిన బ్రెడ్ తీసుకుంటే 49% శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు.. బ్రౌన్ బ్రెడ్ లో విటమిన్ బి, ఈ మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం విటమిన్ ఈ లు మానసిక ఒత్తిడిల ను తగ్గించడంతోపాటు ప్రశాంతతను అందిస్తాయట. బ్రౌన్ బ్రెడ్ లో ఉండే పోలేట్ కణాలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. అలాగే అధిక రక్తపోటును తగ్గిస్తాయి.గోధుమపిండితో చేసినవి గోధుమ పిండితో చేసిన వాటిని బ్రౌన్ బ్రెడ్ అంటారు.
ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. అలాగే వీటిలో ఉండే తృణధాన్యాలు గుండె స్ట్రోక్ ప్రమాదం తగ్గిస్తాయి. ఈ బ్రౌన్ బ్రెడ్ లోవిటమిన్ బి, విటమిన్ ఈ విటమిన్ కీలకి శక్తివంతమైన మూలం ఒకటి. బ్రౌన్ బ్రెడ్ సెరోటిన్ అనే న్యూరో ట్రాన్స్ మీటర్ ను విడుదల చేయడం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది.రోజు రెండు తినడం వల్ల వత్తిడిని తగ్గించుకోవచ్చని చాలామంది నమ్ముతారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. తాజాగా ఉండే బ్రౌన్ బ్రెడ్ ను మనం ఎంచుకోవాలి. అలాగే రొట్టె వాసన ఆకృతి చూసి దాన్ని అంచనా వేయవచ్చు.. అయితే మైదాతో తయారు చేసిన బ్రెడ్ కన్నా గోధుమపిండితో తయారుచేసిన బ్రెడ్ మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు…..