Beauty Tips : ఈ పొరపాట్లు చేస్తున్నారా..? అయితే మీ సౌందర్యానికి తప్పదు ముప్పు…!!
Beauty Tips : ఎవరైనా సరే అందంగా కనిపించాలి అని అనుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మన ఉన్న కాలంలో అందం అనేది ముఖ చర్మానికి సంబంధించినది కాకుండా మనిషి వ్యక్తిత్వానికి చెందినదిగా మారిపోయింది. కావున లక్షల రూపాయలు ఖర్చుచేసి మరి అందంగా కనిపించే ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అయితే అందంగా కనపడాలి. అని అందరూ కోరుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ల చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న క్రీమ్లను వాడుతూ ఉంటారు. ముఖానికి చర్మానికి కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ను అప్లై చేస్తూ ఉంటారు. అయితే మనకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు వల్ల చర్మ సౌందర్యం పాడవుతూ ఉంటుంది. మెరిసిపోవాల్సిన చర్మం మనం చేసే పొరపాట్లే ప్రధానం కారణమవుతున్నాయి.. ఈ విధంగా చేయడం వలనే చిన్న వయసులోనే చర్మం ముడతలు వస్తున్నాయి.
చర్మ ఆరోగ్యం కోసం జీవనశైలిలో ఈ తప్పులు జరగకుండా చూసుకుంటే మంచిది. అలాగే చర్మ సంరక్షణ కోసం ముఖం అందంగా కనపడాలి అంటే ఎటువంటి పొరపాట్లు చేయకూడదు ఇప్పుడు మనం చూద్దాం… ముఖాన్ని పదేపదే కడగడం : చాలామంది ముఖం చర్మం జిడ్డుగా ఉందని పదేపదే కడుగుతూ ఉంటారు. నిజానికి చర్మం నుంచి విడుదలయ్యే స్రవాలు మన ముఖానికి మేలు చేస్తాయి. పదేపదే ముఖాన్ని కడగడం వలన ఆస్రవాలు తొలిగిపోతుంటాయి. వాటి ఫలితంగా ఎన్నో రకాల చర్మ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి. కావున పదేపదే ముఖాన్ని కడగడం మర్చిపోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. రోజు రెండు మూడు సార్లు కంటే ఎక్కువ ముఖం కడకూడదని చెప్తున్నారు. సరిపడా నీటిని తీసుకోకపోవడం ; మీరు శరీరాన్ని హైడ్రేట్ గా రిఫ్రెస్ గా ఉంచుతుందని అందరికీ తెలిసిన విషయమే.
దాని వలన చర్మం కూడా ఆరోగ్యంగా ఉండటమే కాక చర్మం మెరుస్తూ ఉంటుంది. అయితే తగినంత నీరు తాగకపోవడం వలన డిహైడ్రేషనకు గురవుతుంది. దాని వలన చర్మం పొడి వారి పోతూ ఉంటుంది. ప్రతిరోజు మేకప్ వేసుకోవడం : చాలా రకాల కాస్మోటిక్ మన చర్మాన్ని సరిపడవు. ప్రధానంగా మేకప్ ఉత్పత్తులు చర్మానికి చికాకు లేదా మొటిమలు పెరగడానికి దారితీస్తూ ఉంటాయి. వివిధ రంగులు కాజోలను వాడడం వలన కళ్ల చుట్టూ మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. దాని వలన రోజు వేసుకునే మేకప్ మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. పోషకాహారం తీసుకోకపోవడం : ఫాస్ట్ ఫుడ్, స్పైసి ఫుడ్ లో మొటిమలు, రోసిసియా అలర్జీలకు కారణమయ్యే పదార్థాలు ఉంటాయి. వీటికి బదులుగా పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే తాజా పండ్లు కూరగాయలు తినాలని చెబుతున్నారు.
అలాగే పోషకాలు లేని పదార్థాలు తినడం వలన ఎన్నో రకాల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు.. తరచూ చర్మాన్ని తాకడం : మనకు తెలియకుండానే మనం ముఖాన్ని పదేపదే తాకుతూ ఉంటాం. ఈ విధంగా చేయడం వలన మన చేతులలో ఉండే సూక్ష్మ క్రిములు చర్మంపై దురదను దద్దుర్లు కలిగిస్తాయి. కావున చర్మాన్ని తాకేముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రం లేని చేతులతో ముఖాన్ని తాకవద్దని వైద్య నిపుణులు చెప్తున్నారు. నిద్ర లేకపోవడం : శరీరానికి సరిపడినంత నిద్ర లేకపోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఆ నేపథ్యంలోనే చర్మాన్ని ఆరోగ్యంగా ముడతలు పడకుండా ఉంచి కొల్ల జెన్ వంటి ప్రోటీన్లు ఉత్పత్తి తగ్గిపోతాయి. మంచి చర్మం కోసం రోజు కంటిని నిద్రపోవాలి…