Diabetes : మధుమేహంతో బాధపడుతున్నారా? బెండకాయతో ఇలా ట్రై చేయండి..
Diabetes : ప్రస్తుత యుగంలో చాలా మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అప్పట్లో కేవలం వయసు మీద పడిన వారికి మాత్రమే ఈ వ్యాధి ఎక్కువగా వచ్చేది. కానీ ప్రస్తుతం చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఈ వ్యాధి బాధిస్తోంది. ప్రస్తుత జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి బెండకాయ బాగా హెల్ప్ అవుతుంది. చాలా సంవత్సరాలుగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుందనే విషయం తెలిసిందే. చాలా ప్రయోగాల్లో ఈ విషయం స్పష్టమైంది. బెండకాయ.. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తినే కూరగాయగా ప్రసిద్ధి చెందిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సమతుల్య ఆహారం, మెరుగైన జీవనశైలి, మంచి విశ్రాంతితోపాటు డయాబెటిస్‌ను నివారించవచ్చు. ఈ వ్యాధి వల్ల శరీరంలోని ఇతర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. అలాంటి ప్రమాదాలను నివారించడానికి కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం మంచింది. అలాంటి వాటిలో బెండకాయ సైతం ఒకటి. రక్తంలో చక్కెరలను నియంత్రించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనిని పొడిగా చేసుకునే ఉపయోగిస్తే చాలా ప్రయోజనం చేకూరుతుంది.బెండకాయను వారానికి మూడుసార్లు తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
Diabetes : ఇలా వాడితే బెటర్..
బెండకాయను ఎండబెట్టి పొడి చేసుకుని వాడితే త్వరగా ఫలితాలు కనిపిస్తాయి. బెండకాయ వాటర్‌ను సైతం వాడొచ్చు. ముందుగా 3 నుంచి 5 బెండకాయలను తీసుకోవాలి. దాని తలా, తోక కత్తిరించిన తర్వాత పై నుంచి కిందికి చీలికలా చేయాలి. వీటిని 2 గ్లాసుల నీటిలో రాత్రంతా నానబెట్టాలి. వీటిని ఉదయం లేచిన తర్వాత గుజ్జు లేదా పిండిగా చేసుకోవాలి. ఉదయాన్నే పడి కడుపుతో దీనిని తీసుకుంటే అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. దీని వల్ల అలెర్జీలు వచ్చే అవకాశం ఉన్నందున చాలా మంది బెండకాయలను తినేందుకు ఇష్టపడరు. ఇలాంటి వారు బెండకాయలను పక్కన పెట్టాల్సిందే.