Nutmeg Water : జాజికాయ నీళ్లతో ఈ సమస్యలన్నింటికి చెక్…!
ప్రధానాంశాలు:
Nutmeg Water : జాజికాయ నీళ్లతో ఈ సమస్యలన్నింటికి చెక్...!
Nutmeg Water : జాజికాయకు Nutmeg ఆయుర్వేదంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అనేక రోగాలను నయం చేయడంలో జాజికాయ ఎంతగానో సహాయపడుతుంది. ఒక చిటికెడు జాజికాయ పొడిని నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు జాజికాయ నీటిని రాత్రి పడుకునే ముందు తాగడం వలన ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఇక జాజికాయ నీటిలో విటమిన్ సి, విటమిన్ డి మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
Nutmeg Water జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం
ఎసిడిటీ గ్యాస్ మలబద్ధకం వంటి కడుపుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు జాజికాయ నీటిని డైట్ ప్లాన్ లో భాగం చేసుకోవాలి. అలాగే పేగు ఆరోగ్యానికి కూడా జాజికాయ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక నిద్రలేని సమస్యతో బాధపడుతున్న వారు ఈ డ్రింక్ ని కచ్చితంగా తాగాలి.
Nutmeg Water రక్తపోటును నియంత్రిస్తుంది
అధిక రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా జాజికాయ నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. దీనివలన రక్తపోటును నియంత్రించవచ్చు. నోటి దుర్వాసన వస్తున్నట్లయితే జాజికాయ నీరు ఉపయోగపడుతుంది. అదేవిధంగా జాజికాయ నీరు మానసిక ఆరోగ్యానికి కూడా మేలు కలిగిస్తుంది. ఇది సహజ పానీయం కావడంతో జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
ఎప్పుడు త్రాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది : రాత్రి పడుకునే ముందు జాజికాయ పొడి కలిపిన నీటిని తాగితే మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యం పై సానుకూల ప్రభావాలను చూపుతుంది. అయితే ఈ డ్రింక్ ని ప్రతిరోజు సరైన మోతాదులో తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
Nutmeg Water జాజికాయ నూనె
జాజికాయ నూనె రుచి కూడా మేలు చేయడంలో సహాయపడుతుంది. కాకపోతే దీనిని వంటలలో తక్కువగా ఉపయోగించాలి. ఇందులో ఔషధ మరియు సౌందర్య కారకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆయుర్వేదంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఇందులో ఉండే కారకాలు గుండె జబ్బులు , అర్థరైటిస్ మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అదేవిధంగా జాజికాయలు యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉండడంతో చర్మంపై మొటిమలు మచ్చలను తగ్గిస్తుంది.