Cluster Beans : గోరుచిక్కుడు కాయను చిన్న చూపు చూడకండి… దీని ఔషధ గుణాలు తెలిస్తే మతిపోతుంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cluster Beans : గోరుచిక్కుడు కాయను చిన్న చూపు చూడకండి… దీని ఔషధ గుణాలు తెలిస్తే మతిపోతుంది…?

 Authored By ramu | The Telugu News | Updated on :6 July 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Cluster Beans : గోరుచిక్కుడు కాయను చిన్న చూపు చూడకండి... దీని ఔషధ గుణాలు తెలిస్తే మతిపోతుంది...?

Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే పారిపోతారు. అమ్మో నాకొద్దు అంటూ దూరం పెడతారు. ఇలాంటి వారికి గోరుచిక్కుడుకాయ ప్రయోజనాలు తెలిస్తే ఇకనుంచి ఈ పొరపాటు చేయరు. గోరుచిక్కుడులో ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా గోరుచిక్కుడు పోషకాల ఘని. ఈ గోరు చిక్కుడుకాయ డయాబెటిస్ ని నియంత్రిస్తుంది. ఇంకా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రకాల ఆరోగ్య సమస్యలను ఏం చేయగలిగే దివ్య ఔషధం అని చెప్పవచ్చు. గోరు చిక్కుడుకాయను మీరు ఆహారంలో చేర్చుకున్నట్లైతే, ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…
గోరు చిక్కుడుకాయను కొన్ని ప్రాంతాలలో గోకరకాయ, మటక్కాయ, గోరుచిక్కుడుకాయ అని పిలుస్తారు. సాధారణంగా మనం ఈ కూరగాయను చాలా చిన్నచూపు చూస్తాం. దీనిలో ఎన్నో అద్భుతమైన పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అనేది నిజం. ఇది అన్నంలోకి, చపాతీతో పాటు,జొన్న రొట్టెలతో కాంబినేషన్ తో తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. కూరగాయని మీ ఆహారంలో చేర్చుకుంటే దీని లాభాలను పొందవచ్చు.

Cluster Beans గోరుచిక్కుడు కాయను చిన్న చూపు చూడకండి దీని ఔషధ గుణాలు తెలిస్తే మతిపోతుంది

Cluster Beans : గోరుచిక్కుడు కాయను చిన్న చూపు చూడకండి… దీని ఔషధ గుణాలు తెలిస్తే మతిపోతుంది…?

Cluster Beans గోరు చిక్కుడు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడం  : గోరుచిక్కుడు లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ ను నెమ్మదిగా విడుదల ఎలా చేస్తుంది. తక్కువ గ్లైసి మీకు ఇండెక్స్ ని కలిగి ఉండడం వల్ల షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వారానికి ఒక్కసారైనా గోరుచిక్కుడు తింటే షుగర్ స్థాయిలో అదుపులోకి వస్తాయంటున్నారు నిపుణులు.

జీర్ణక్రియ మెరుగుదల : చిక్కుల్లో ఉండే పీచు పదార్థం,జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది. ఇది మలబద్ధకం జీర్ణం అంటే సమస్యలు నివారించే పేగు కదలికన్ను సులభతరం చేస్తుంది.

కొలెస్ట్రాల్ తగ్గింపు : గోరు చిక్కుడు చెడు కొలెస్ట్రాల్ (LDL)స్థాయిలను తగ్గించడంలో సహకరిస్తుంది. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఎముకలను బలంగా చేస్తుంది : ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ లో అధికంగా ఉంటాయి. గోరుచిక్కుడు ఎముకల్లో బలపరుస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల నష్టాన్ని తగ్గించి ఎముకలను ఆరోగ్యంగా బలంగా చేస్తుంది.

రక్తహీనత నివారణ : గోరు చిక్కుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఇది చాలా మంచిది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.ముఖ్యంగా, గర్భిణీ స్త్రీలకు ఇది ఫోలేట్,ఐరన్ అందించి, పిండం అభివృద్ధికి తోడ్పడుతుంది.

బరువు నియంత్రణ  : గోరు చిక్కుడు లో కేలరీలు తక్కువగా ఉంటాయి.ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. త్వరగా కడుపు భావన కలుగుతుంది. ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా నియంత్రిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

రక్త ఫోటో నియంత్రణ : గోరు చిక్కుల్లో సి విటమిన్ ఉంటుంది. ఇది ఇతర యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. దీనిలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంటుంది.శరీరానికి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.

క్యాన్సర్ నివారణ : గోరు చిక్కుడు లో ఉండే ఫైటో కెమికల్స్,క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది అని కొన్ని అధ్యయనాల్లో నిరూపించారు. గోరుచిక్కుడును కూరగా,సలాడుగా లేదా ఇతర వంటకాలలో భాగంగా తీసుకోవచ్చు. దీనిలోని పోషక ప్రయోజనాలను పొందడానికి దీన్ని తరచుగా మీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు,లేదా మందులు తీసుకునేవారు, గోరుచిక్కుడును అధికంగా కునే ముందు వైద్యులని సంప్రదించడం ఉత్తమం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది