Dates : ప్రతిరోజు పరిగడుపున దీంతో ఖర్జూరం తీసుకుంటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dates : ప్రతిరోజు పరిగడుపున దీంతో ఖర్జూరం తీసుకుంటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే..!

 Authored By aruna | The Telugu News | Updated on :2 February 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Dates : ప్రతిరోజు పరిగడుపున దీంతో ఖర్జూరం తీసుకుంటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే..!

Dates : ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ లో ఖర్జూరం ముఖ్యమైనది.. ప్రతిరోజు ఈ ఖర్జూరం తీసుకున్నట్లయితే శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా దీంతో ఎన్నో లాభాలు ఉన్నాయి.. అయితే ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఖర్జూరం ఈ విధంగా తీసుకున్నట్లయితే శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. ఈ ఖర్జూరంలో ఎన్నో ఔషధ గుణాలు శరీరాన్ని రక్షిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు హార్మోన్ల సమతుల్యతలో కూడా సహాయపడతాయి.

మరీ ముఖ్యంగా ఖర్జూరంను ఉదయం పరిగడుపున తీసుకున్నట్లయితే మరిన్ని లాభాలను పొందచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఎన్నో లాభాలు పొందవచ్చు అని అంటున్నారు. అయితే నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… ఖర్జూరం నెయ్యి కలిపి తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. ఖర్జూరాలలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది పేగుల కదలికను నియంత్రించడంలో సహాయపడతాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే నెయ్యిలో బ్యుట్రిక్ యాసిడ్ కలిగి ఉంటుంది.

ఇది గట్ బ్యాక్టీరియా సమతుల్యతను రక్షిస్తాయి. నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలను తినడం వలన జీర్ణ క్రియ మెరుగవుతుంది. మలబద్ధకం నుండి బయటపడవచ్చు. నెయ్యిలో నానబెట్టిన ఖర్జునాన్ని తినడం వలన ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరాన్ని ఈ విధంగా తీసుకుంటే రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు.. ఖర్జూరం నెయ్యి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఖర్జూరంలో పుష్కలంగా ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని నుంచి కాపాడతాయి. నీళ్లు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది