Diabetes : వీటిని నానబెట్టుకుని తింటే .. డయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చు ..!!
Diabetes : ఖర్జూరాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా నానబెట్టిన ఖర్జూరాలను తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందుకోసం రాత్రంతా ఖర్జూరాలను నానబెట్టి తర్వాతి రోజు ఉదయాన్నే పరిగడుపున వాటిని తినాలి. వీటిలో ఫైబర్, విటమిన్స్, ప్రోటీన్స్, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. వీటిని కనుక ప్రతిరోజు తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడేవారు ఖర్జూరం తింటే చాలా మంచిది. ఇవి తక్కువ గ్రెసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. నానబెట్టిన ఖర్జూరాలను తినడం వలన రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్లో ఉంటుంది.
అలాగే ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తినడం వలన కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. ఖర్జూరంలో చాలా విటమిన్స్ ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. చర్మంపై ముడతలను తొలగించే యాంటీ ఏజింగ్ కారకంగా పనిచేస్తుంది. నానబెట్టిన ఖర్జూరాలను తినడం వలన రోజంతా ఎనర్జీగా ఉంటారు. ఇవి అలసట, బలహీనతను తొలగిస్తాయి. శరీరాన్ని శక్తివంతంగా ఉంచటంలో సహాయపడతాయి. నానబెట్టిన ఖర్జూరంలో కాపర్,
సెలీనియం మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను గట్టిగా ఉంచడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు పని చేస్తాయి. ఖర్జూరాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. ఇది అనేక కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరాలు తినాలి. అలాగే ఖర్జూరాలను తినటం వలన మెదడు చాలా చురుకుగా ఉంటుంది. ఇందులో విటమిన్ బి ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.