Fruit Salads : మీరు ఫ్రూట్స్ సలాడ్స్ ఎక్కువగా తింటున్నారా… ఈ రకమైన పండ్లు, కూరగాయలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసుకోండి….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fruit Salads : మీరు ఫ్రూట్స్ సలాడ్స్ ఎక్కువగా తింటున్నారా… ఈ రకమైన పండ్లు, కూరగాయలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసుకోండి….?

 Authored By ramu | The Telugu News | Updated on :18 December 2024,3:00 pm

Fruit Salads : ప్రస్తుత కాలంలో ఫ్రూట్ సలాడ్స్ ను కలిపి తింటూఉంటారు. కానీ ఇలా తినవచ్చా లేదా అనేది ఎవరికీ సరిగా తెలియదు. ఫ్రూట్స్ వెజిటేబుల్,సలాడ్స్ ను కలిపి తినే ముందు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు వివి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉందని, కొన్ని పండ్లు, కూరగాయల సలాడ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరికి ఫ్రూట్స్ సలాడ్ అంటే ఇష్టం. మరికొందరికి వెజిటేబుల్స్ సలాడ్ అంటే ఇష్టం. మరికొందరికి పండ్లు, కూరగాయలు కలిపిన సలాడ్ తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అయితే ఇలా పండ్లు,కూరగాయలు కలిపిన సలాడ్ తినడం మంచిదా…! అనే విషయం తెలుసుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పండ్లు కూరగాయలు కలిపి తినడం వల్ల కలిగే లాభ,నష్టాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. ఈ పండ్లు, కూరగాయలు.. ఈ రెండిట్లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్,పొటాషియం, జింగ్, ఐరన్ వంటి అనేక పోషకాలు శరీరానికి కావలసినవన్నీ సమృద్ధిగా లభిస్తాయి. ఇలాంటి పోషకాలు శరీరానికి కావలసినవి ఈ పండ్లు కూరగాయల సలాడ్ లో లభించడం వలన దీనిని తినడం ఆరోగ్యకరమైన ఎంపిక అంటున్నారు పోషకాహార నిపుణులు.

Fruit Salads మీరు ఫ్రూట్స్ సలాడ్స్ ఎక్కువగా తింటున్నారా ఈ రకమైన పండ్లు కూరగాయలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసుకోండి

Fruit Salads : మీరు ఫ్రూట్స్ సలాడ్స్ ఎక్కువగా తింటున్నారా… ఈ రకమైన పండ్లు, కూరగాయలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసుకోండి….?

తాజా పండ్లు కూరగాయలలో సలాడ్ తింటే వాటి నుండి ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పొందటమే కాకుండా ఇలా తీసుకోవడం వల్ల క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఈ ఫ్రూట్స్ సలాడ్,వెజిటేబుల్ సలాడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని వీటిని తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ఫ్రూట్స్ అండ్ కూరగాయల సలాడ్స్ తో కలిపి తింటే మంచి కాంబినేషన్లో ఎంచుకోవాలి. ఆపిల్, క్యారెట్, ఎర్రముల్లంగి వంటి సలాడ్ గా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఫ్రూట్స్ అండ్ కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్,విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉన్నాయి.

డయాబెటిస్, కిడ్నీ రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన సలాడ్ చేయడానికి ముందు పండ్లు,కూరగాయని శుభ్రంగా కడుగుతూ మాత్రమే మర్చిపోవద్దు అంటున్నారు. ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ సలాడ్స్ ను కలిపి తినే ముందు జాగ్రత్తగా ఉండాలని నీపుణులు చెబుతున్నారు. ఇవి కొన్నిసార్లు శరీరానికి అనారోగ్యాన్ని కూడా కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని ఫ్రూట్స్ కూరగాయలు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. అంతేకాదు ఫ్రూట్స్ అండ్ కూరగాయలను సలాడ్ రూపంలో తినడం వల్ల అలర్జీ సమస్యలు వస్తాయి. వాటిని సరైన మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది