Coriander Benefits : కొత్తి మీరలో ఎన్ని ఔషద గుణాలు ఉన్నాయో మీకు తెలుసా.. ముఖ్యంగా ఈ వ్యాధులకి దివ్య ఔషదం
Coriander Benefits : మన వంటల్లో రుచి, వాసన, ఆకర్షణ పెంచే ముఖ్యమైన పదార్థం కొత్తిమీర. ప్రతి వంటకానికి చివర్లో చిటికెడు కొత్తిమీర వేసిస్తే ఆ వాసన, రుచి ప్రత్యేకం. కొత్తిమీర ఆకుల్లో శరీరానికి అవసరమైన అనేక రకాల విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి.ఇందులో ప్రధానంగావిటమిన్లు A, C, K ఉంటాయి. వీటితో కళ్లు, ఆరోగ్యం, చర్మం, ఎముకలు బలంగా తయారవుతాయి.
Coriander Benefits : చాలా పోషకాలు..
ఫోలేట్, కాల్షియం, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని కొత్తిమీర ఆకులు నమలడం లేదా వాటి నీటిని త్రాగడం వల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను శక్తివంతంగా పనిచేయేలా చేస్తుంది.
Coriander Benefits : కొత్తి మీరలో ఎన్ని ఔషద గుణాలు ఉన్నాయో మీకు తెలుసా.. ముఖ్యంగా ఈ వ్యాధులకి దివ్య ఔషదం
కొత్తిమీరలో ఉండే విటమిన్ C శరీర రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దాంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి కాలానుగుణ వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇందులో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్‌ను సరిచేసి, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.విటమిన్ A, C లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని నిగారింపుగా, ప్రకాశవంతంగా తయారుచేస్తాయి. కొత్తిమీర నీరు డిటాక్స్ డ్రింక్‌లా పనిచేస్తుంది.కొత్తిమీరలో ఉండే ఫోలేట్ గర్భిణీల ఆరోగ్యానికి అత్యంత అవసరం.