Sprouted Potatoes : మొలకెత్తిన బంగాళదుంపలు తింటే ఎంత ప్రమాదమో తెలుసా…??
Sprouted Potatoes : దాదాపు ప్రతి ఒక్కరి వంట గదిలో ఆలుగడ్డలు అనేవి కచ్చితంగా ఉంటాయి. ఇవి తొందరగా పాడవకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. అలాగే దీనిలో పొటాషియం అనేది అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కానీ దీనిని నూనెలో వేయించి తినడం మంచిది కాదు. వాటిని ఉడకపెట్టి తీసుకుంటే మంచిది. ఈ ఆలుగడ్డలతో ఎన్నో రకాల వంటకాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఆలుగడ్డలను సాంబార్ నుండి ఫ్రెంచ్ ఫ్రేస్ వరకు […]
ప్రధానాంశాలు:
Sprouted Potatoes : మొలకెత్తిన బంగాళదుంపలు తింటే ఎంత ప్రమాదమో తెలుసా...??
Sprouted Potatoes : దాదాపు ప్రతి ఒక్కరి వంట గదిలో ఆలుగడ్డలు అనేవి కచ్చితంగా ఉంటాయి. ఇవి తొందరగా పాడవకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. అలాగే దీనిలో పొటాషియం అనేది అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కానీ దీనిని నూనెలో వేయించి తినడం మంచిది కాదు. వాటిని ఉడకపెట్టి తీసుకుంటే మంచిది. ఈ ఆలుగడ్డలతో ఎన్నో రకాల వంటకాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఆలుగడ్డలను సాంబార్ నుండి ఫ్రెంచ్ ఫ్రేస్ వరకు వాడతారు. ఈ ఆలుగడ్డలను మార్కెట్లో కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. లేకుంటే ప్రమాదంలో పడతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం…
ఈ ఆలుగడ్డలు కోని ఇంటికి తెచ్చిన తర్వాత వాటిని వెంటనే వాడకపోతే కొన్ని రోజుల తర్వాత అవి మొలకలు వస్తాయి. అయితే కొంతమంది ఈ మొలకలను తీసేసి అవి వంటకు వాడతారు. అయితే బెంగళూరుకు చెందినటువంటి డాక్టర్ దీపక్ ఆరాధ్య మాత్రం ఇలా చేస్తే ప్రమాదంలో పడతారు అని హెచ్చరిస్తున్నారు. ఈ మొలకెత్తినటువంటి ఆలుగడ్డలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటున్నారు. ఎందుకు అంటే మొలక వచ్చిన ఆలుగడ్డ లేక ఆకు పచ్చగా మారిన ఆలుగడ్డలో సోలానైన్ మరియు చకొనైన్ అనేది ఉత్పత్తి అవుతాయి. వీటిని తీసుకోవటం వలన శరీరం విషయంగా మారుతుంది. దీంతో వాంతులు మరియు వికారం,విరోచనాలు, తలనొప్పి లాంటి సమస్యలకు దారి తీస్తుంది.
అంతేకాక ఇది తలనొప్పికి మరియు తల తిరగడం లాంటి నరాలకు సంబంధించిన లక్షణాలను కూడా కలిగి ఉంటుంది అని అంటున్నారు డాక్టర్ దీపక్ ఆరాధ్య. కాబట్టి ఇకమీదట నిల్వ ఉంచిన ఆలుగడ్డలను వండేటప్పుడు ఈ విషయాలను గుర్తు పెట్టుకొని వాటిని వాడితే మంచిది. లేకుంటే లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి