Potatoes : బంగాళదుంప్పల పై మొలకలు త్వరగా రాకుండా ఉండాలంటే… ఈ విధంగా చేయండి..?
ప్రధానాంశాలు:
Potatoes : బంగాళదుంప్పల పై మొలకలు త్వరగా రాకుండా ఉండాలంటే... ఈ విధంగా చేయండి..?
Potatoes : మనం మార్కెట్ నుంచి ఎన్నో రకాల కూరగాయలను తెచ్చి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాం. అటువంటి కూరగాయలలో బంగాళదుంపలు ఎక్కువ కాలం నిలువ ఉంటాయని ఎక్కువగా తెచ్చుకుంటారు. అయితే ఇవి నిల్వ ఉంటాయని లేటుగా వండుకొని తింటాం. ఈ సమయంలో ఆలుగడ్డలు త్వరగా మొలకెత్తుతుంటాయి. ఈ బంగాళదుంపలను కొంతమంది పడేయకుండా అలాగే వినియోగిస్తూ ఉంటారు. కానీ అలా వినియోగిస్తే ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే బంగాళదుంపల్ని ఎక్కువ కాలం నిల్వ ఉన్నప్పుడు మొలకెత్తకుంట తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం…
ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయినప్పుడు ఒక ఆలుగడ్డలు ఇంట్లో మిగిలి ఉంటాయి. వీటిని అన్ని కూరగాయలు వండిన తరువాత లాస్ట్ లో ఆలుగడ్డలని వండుతాను. అందరూ ఆలుగడ్డ కర్రీని కూడా ఎక్కువగానే ఇష్టపడతారు. కూరగాయలు లేనప్పుడు బెస్ట్ ఆప్షన్ గా ఈ బంగాళదుంపలను ఎంచుకుంటారు. ఈ ఆలూతో కుర్మాలను రుచికరమైన ఫ్రై, మరియు గ్రేవీ, ఇంకా ఆలు కర్రీ ఇలాంటివి ఎన్నో రుచిగా చేసుకుంటారు. తాను టెస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే ఈ ఆలూ కర్రీని ఎక్కువగా తింటూ ఉంటారు. బంగాళదుంపలు కూడా మార్కెట్ నుంచి తెచ్చిన తరువాత ఇంట్లో ఎక్కువ కాలం నిల్వ ఉండవు. ఇవి త్వరగా కుళ్లిపోయి పాడైపోతాయి. చల్లటి వాతావరణం లో ఉంచితే మొలకలు వస్తాయి. కానీ ఈ పద్ధతిని పాటిస్తే బంగాళదుంపలు చెడిపోవు, అలాగే మొలకలు కూడా రావు. మరి ఏం చేస్తే ఈ ఆలూ పై మొలకలు రావో తెలుసుకుందాం..
ఈ బంగాళదుంపలు మొలకెత్తకుంట ఉండాలంటే ఉత్తమమైన మార్గం బంగాళాదుంపలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచవద్దు. కూరగాయలు కొనేటప్పుడు అవసరానికి అనుగుణంగా కొనుగోలు చేసుకోవడం చాలా ఉత్తమం. బంగాళదుంపలను చల్లటి ప్రదేశంలో, చీకటి, బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో నిల్వ ఉంచాలి. కొంతమంది బంగాళదుంపలను రిఫ్రిజిరేటర్ లో నిల్వ ఉంచుతారు. ఇలాంటి తప్పు అస్సలు చేయకండి. చల్లటి వాతావరణం పిండి పదార్థాలను చెక్కర్లుగా మారుస్తుంది. ద్వారా దాని రుచి కూడా పోతుంది. వీలైనంతవరకు ఆ బంగాళదుంపలను బయట గాలికే ఉంచాలి.
అసలు విషయానికొస్తే.. బంగాళదుంపలు మొలకలు రావడానికి కారణం అధిక తేమ, కాబట్టి బంగాళదుంపలను సీల్డ్ ప్లాస్టిక్ బ్యాగులకు బదులు, పేపర్ బ్యాగ్, బుర్లాప్ బ్యాగ్, బాస్కెట్ వంటి గాలి చొరబడిన డబ్బాలో నిల్వ ఉంచడం మంచిది.
బంగాళదుంపలను ఉల్లిపాయలతోటి కొంతమంది ఉంచుతూ ఉంటారు. అని నిజానికి అలా ఉంచొద్దు. అలాగే అరటి పండ్లతో కూడా నిల్వ ఉంచుతారు. అరటిపండు నుంచి ఇతిలిన్ వాయువు విడుదల చేస్తుంది. ఇది బంగాళదుంపలను వేగంగా మొలకెత్తిలా చేస్తాయి. మన మార్కెట్ నుంచి తెచ్చే ముందే, బంగాళదుంపలు నల్ల మచ్చలు, దెబ్బతిన్న బంగాళదుంపలను కొనుగోలు చేయొద్దు. మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత చల్లటి పొడి, చీకటి ప్రదేశంలో నిల్వ చేయాలి. బంగాళదుంపలను సూర్యలక్ష్మికి వీలైనంత దూరంగా ఉంచడం మంచిది. బంగాళదుంపలపై పచ్చదనం అధిక కాంతి వల్ల ప్రేమిస్తుంది. క్లోరోఫిల్ నూ ఉత్పత్తి చేస్తుంది. పచ్చగా ఉన్న బంగాళదుంపలు చేదుగా ఉంటాయి. ద్వారా అ రుచి కూడా మారుతుంది.