Potatoes : బంగాళదుంపలను అధికంగా తింటే.. ఈ 5 వ్యాధుల బారిన పడక తప్పదు.!!
Potatoes : బంగాళదుంప అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్లు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. వీరితో ఎన్నో రకాల వెరైటీస్ చేస్తూ ఉంటారు. బంగాళదుంప ఫ్రై ఉంటే చాలు కడుపునిండా అన్నం తినేస్తాము.. బంగాళదుంపతో ఏ వెరైటీ వంటకం చేసినా అందరూ ఇష్టపడతారు. ఎంతో రుచిగా ఉండే ఆలు అధికంగా తింటే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బంగాళదుంపలలో 80% నీరు 20 శాతం గణపదార్థం ఉంటుంది. ఆలుగడ్డ ఎక్కువగా తింటున్నారా.. అయితే ప్రమాదమే.. దాని గురించి తెలుసుకుందాం. మనకు విరివిగా లభించే కూరగాయల్లో ఆలుగడ్డ కూడా ఒకటి. అయితే బంగాళదుంపని ఎక్కువగా తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.బంగాళదుంపల్ని తినడానికి టైప్ టు డయాబెటిస్ కు సంబంధం ఉందని ఇప్పుడు చెప్తున్నారు.
కూరగాయలు ఎక్కువగా తినే వారికి టైప్ టు డయాబెటిస్ వచ్చే ప్రమాదం 21 శాతం తక్కువగా ఉందని తేలింది. కార్బోహైడ్రేట్లకు గొప్ప వనరు. బంగాళదుంపలు రక్తంలో చక్కెర స్థాయిలో అస్మతుల్యంగా ఉండేవారు ఆలుగడ్డలు ఎక్కువగా తినకూడదట. ఆలుగడ్డ యొక్క అధిక వినియోగం రక్తపోటును కూడా పెంచుతుంది. అంటే బీపీ రోగులు బంగాళదుంపలు ఎక్కువగా తినకూడదు. అలా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుందట..బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా అధిక మొత్తంలో కేలరీస్ పెరుగుతాయి అని నిపుణులు చెప్తున్నారు.
నిజానికి ఆలుగడ్డలో పొటాషియం, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆలుగడ్డ పొట్టులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కానీ బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండటం వల్ల షుగర్ పేషెంట్లు తినకపోవడం మంచిది అని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ ఆలు షుగర్ పేషెంట్లు అధికంగా తీసుకోకుండా ఉండాలి. ఆలుని తీసుకునే విధానంలో తీసుకుంటే. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు ఉన్నాయి. కానీ వీటిని ఆయిల్ డీప్ ఫ్రై చేయడం.. అలాగే చిప్స్, 65 ఇలాంటివి తింటే ప్రమాదం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు…