Diabetes : ఉదయం లేవగానే మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా… అయితే డయాబెటిస్ ప్రమాదంలో పడినట్లే…!!
Diabetes : చాలామంది డయాబెటిస్ తో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఉదయం లేవగానే వెంటనే ఈ సాంకేతాలు కనిపిస్తే మీరు డయాబెటిస్ ప్రమాదంలో పడినట్లే అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ డయాబెటి స్ వ్యాధి అనేది రోజురోజుకి పెరిగిపోతూ.. చాప కింద నీరులా ప్రవహిస్తుంది. దీనికి వయసు తరహా లేకుండా ఈ వ్యాధి అందరిలోనూ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో మానసిక ఆందోళన ఒత్తిడి ఇలా ఎన్నో కారణాలవల్ల డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారు సంఖ్య ఎక్కువ అవుతుంది. జీవనశైలి ఆహారంలో మార్పులు చేసుకొని బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోకపోతే ఈ సమస్య జీవితాంతం వేధిస్తూ ఉంటుంది. అయితే శరీరంలోని అన్ని అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. షుగర్ వ్యాధి షుగర్ స్థాయిని గుండె జబ్బులు మూత్రపిండాల సమస్యలు స్ట్రోక్ కి దారితీసే అవకాశం ఉంటుంది. శరీరంలో ఇన్సులిన్ తగినంతగా ఉత్పత్తి అవ్వనప్పుడు మధుమేహం బారిన పడుతుంటారు.
మధుమేహం వచ్చిన తర్వాత కంట్రోల్ లేకుంటే రక్తనాళాల సైతం దెబ్బతింటుంటాయి. అయితే కొందరు తెలియకుండా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటాయి. ముందస్తుగా సాంకేతాలు కనిపిస్తున్న పెద్దగా పట్టించుకోరు. నిర్లక్ష్యం చేస్తే షుగర్ వ్యాధి మరింతగా పెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితి రాకముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకి చెక్ పెట్టవచ్చు అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. దీని నేపథ్యంలో షుగర్ను కొన్ని లక్షణాలతో ఈజీగా గుర్తించవచ్చని ఉదయం లేచిన తర్వాత ఈ లక్షణాలు కనబడితే వెంటనే వైద్యనిపుల్ని సంప్రదించాలి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.. నిద్రలేచిన తర్వాత కనిపించే డయాబెటిస్ లక్షణాలు… దురద : శరీరంలో దురద రావడం కూడా షుగర్ లక్షణమే. ఒకవేళ ఉదయం లేచిన వెంటనే మీకు దురదగా అనిపిస్తే అసలు ఆలస్యం చేయొద్దు.. ఎందుకనగా షుగర్ ఉంటే కాళ్లు, చేతులు చర్మంపై దురద వస్తూ ఉంటుంది. కంటి చూపు మసకగా అనిపించడం
: ఉదయం లేచిన వెంటనే మీకు స్పష్టంగా అనిపించకపోతే మసకగా ఉంటే ఇది తప్పకుండా షుగర్ లక్షణంగా గుర్తించవచ్చు. దీన్ని సహజ లక్షణమని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకనగా షుగర్ ఉంటే దృష్టి మసక పారిపోతూ ఉంటుంది. ఒక కంటికి లేదా రెండు కళ్ళకు ఇలా వస్తూ ఉంటుంది.. అలసట : ఉదయం లేచిన వెంటనే ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి. అలా కాకుండా ఉదయం లేచిన వెంటనే అలసటగా ఉంటే మాత్రం ఇది మధుమేహం లక్షణంగా గుర్తించుకోవాలి. కావున ఈ లక్షణం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని కలవాలి.. గొంతు పొడిబారిపోవడం : ఒకవేళ నిత్యం ఉదయం నిద్ర లేచిన వెంటనే దాహం అనిపిస్తే లేదా గొంతు ఎండిపోతుంటే ఇది షుగర్ లక్షణం అవ్వొచ్చు. రోజు ఉదయం లేచిన వెంటనే నీళ్లు తాగాలనిపిస్తే తక్షణం బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పరీక్షించుకోవాలి. ఎందుకనగా గొంతు ఎండిపోవడం డయాబెటిస్ ప్రారంభ లక్షణం. కాబట్టి వెంటనే వైద్యున్ని కలవాలి..