Mosquitoes : మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని… ఇవి వాడుతున్నారా? యమ డేంజర్!
Mosquitoes : ఇంట్లో దోమలు ఎక్కువైతే తరిమి కొట్టేందుకు రకరకాల స్ప్రే, లిక్విడ్స్, మస్కిటో రిప్లైంట్లను వాడుతుంటారు అయితే అవి ఆరోగ్యానికి మంచిదా? కాదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ దోమలను చంపడానికి ఉపయోగించే మందు డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు…?మరియు ఇటువంటి దోమలను చంపడానికి ఉపయోగించే మందుల వలన ఎటువంటి వ్యాధులను కలుగజేస్తాయో తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ మస్కిటో రిప్లైజెంట్ : దోమల్ని తరిమేటుకు మస్కిటో రిప్లై ఇట్లను ఉపయోగిస్తారు. మరి ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయో? కీడు చేస్తాయో? డెంగ్యూ లేదా చికెన్ గున్యా వంటి ప్రాణాంతకరమైన వ్యాధుల్ని ప్రబలించే దోమల నుంచి మనల్ని మనం రక్షించుకొనుటకు ఈ దోమల మందులను దోమల్ని నివారించుటకు ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ దోమల మందు వలన దోమలు చనిపోతాయి కానీ మనిషికి అనారోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అందులో ఉండే ద్రవంలో రసాయనాలు ఉంటాయి. అదే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ట్రాన్స్ ఫ్లూత్రిన్, బ్యూటీ లేటెడ్, హైడ్రాక్సి టోల్ యున్, సిట్రో నెలోల్, డైమథైలో కార్డైన్ , వాసన లేని పారాఫిన్, అనేక సుగంధ సమ్మేళనాలు దోమలను తరిమికొట్టేందుకు,చంపేందుకు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇటువంటి రసాయనాల సొల్యూషన్స్ కు గురికావడం వల్ల వణుకు ఆందోళన, తుమ్ములు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మానికి అలర్జీలు ,జలుబు, దగ్గు తదితర సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ పదార్థాలు కేటగిరి టు క్యాన్సర్ కారకాలని చెబుతున్నారు. ఈ రసాయనాల వల్ల క్యాన్సర్ పెరుగుదలకు కారణం అవుతుంది.ఇది పిల్లలలో రోగనిరోధక వ్యవస్థను. ప్రెగ్నెన్సీ తో ఉన్నవారికి పిండం అభివృద్ధి చెందుతున్న మెదడును పై తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఇది చర్మ సునితత్వం, శ్వాసకోశ సమస్యలను కలిగించే సుగంధ సమ్మేళనాలను కలిగి ఉంటుంది.ఇది తలనొప్పి, ఏకాగ్రతను కష్టతరం చేస్తుంది. అలాగే కొందరు కిటికీలను తలుపులను మూసి ఉంచి, ఇంటిలో ఈ మస్కిటో కాయిల్స్ నీ వినియోగించడం వలన మరింత ప్రమాదకరంగా మారవచ్చు. వీటివలన గర్భిణీలు,నవజాత శిశువులు,చిన్నపిల్లలు, వృద్ధులు,పెంపుడు జంతువులు వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.