Vitamin B12 : ఈ ఆహారం తీసుకుంటే బీ12 విటమిన్ తగ్గిపోతుందా…? ఓ అధ్యాయనంలో షాకింగ్ న్యూస్…!!
Vitamin B12 : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో ఎన్నో మార్పులు రావడం అందరికి తెలిసిన విషయమే.. తీసుకునే ఆహారంలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఎన్నో రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కావున ఆరోగ్యంపై జాగ్రత్తలు వహించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన బాడీ ఫిట్నెస్ అనేది కంట్రోల్ లో ఉంటుంది. శరిరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తూ ఉండాలి. లేకపోతే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అలాగే విటమిన్ బి12 అత్యంత ప్రధానమైన పోషకాలలో ఒకటి. ఇది డీఎన్ఏ సంశ్లేషణ శక్తి ఉత్పత్తి కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు లాంటి కొన్ని ప్రక్రియలలో శరీరానికి చాలా ఉపయోగపడుతుంది.
ఇప్పుడు చాలామంది విటమిన్ బి12 తగ్గిపోవడంతో ఎంతో ఇబ్బంది చెందుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన ఈ సమస్య వస్తుంది. విటమిన్ బి12 లోపం సంకేతాలు లక్షణాలు చికిత్సను వైద్య నిపుణులు తెలియజేయడం జరిగింది… విటమిన్ బి12 లేకపోవడం మూలంగా గ్యాస్ట్రో ఎంటీరీస్ జీర్ణ సంబంధిత వ్యాధులు సంభవిస్తున్నాయి. కొన్ని సమయాలలో ఈ వ్యాధిగ్రస్తులు జీవితాంతం విటమిన్ బి12 మందులు వేసుకోవాల్సి వస్తుంది. విటమిన్ బి12 కోసం చికిత్స ఎంపికలలో విటమిన్ బి12 మందులు విటమిన్ బి12 ఇంట్రా మాస్కులర్ ఇంజక్షన్లు విటమిన్ బి12
నాజల్స్ జెల్, విటమిన్ బి12 స్ప్రే వాడవల్సి ఉంటుంది. బి12 లోపం మూలంగా శ్వాస ఆడకపోవుట, అలసట, లేత పసుపు రంగు చర్మం, తల తిరగడం, క్రమరహిత హృదయ స్పందనలు బరువు తగ్గిపోవడం, కాళ్లు చేతులలో తిమ్మిరి, కండరాల బలహీనత గందరగోళం లాంటివి ఎన్నో సాంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. విటమిన్ బి12 అధికంగా గుడ్లు, మాంసం పాలల్లో ఎక్కువగా ఉంటుంది. శాఖాహారులైతే మెరుగైన ఆరోగ్యం కోసం అల్పాహారం త్రుణ ధాన్యాలు పోషక ఈస్ట్ ఆహార ఉత్పత్తులను తీసుకోవాలి. హానికరమైన రక్తహీనత ఇబ్బంది పడుతున్న వారు అరుదైన వైద్య పరిస్థితి మూలంగా ప్రోటీన్ ను అంతర్గత కారకాలకు ఉత్పత్తి చేయలేవు. కావున విటమిన్ బి12 లోపం అనేది వస్తూ ఉంటుంది..