Health Tips : ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగుతున్నారా? ముఖ్యంగా పురుషులకు ఈ సమస్యలు తప్పవు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగుతున్నారా? ముఖ్యంగా పురుషులకు ఈ సమస్యలు తప్పవు

 Authored By saidulu | The Telugu News | Updated on :2 October 2022,5:00 pm

Health Tips : ప్రస్తుత భారత దేశంలో ప్రతి సంవత్సరం దాదాపుగా 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి వచ్చే ఐదేళ్లలో మరింత రెట్టింపు అవుతుందని అంటున్నారు కాబట్టి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ అయింది. ఎక్కడికి వెళ్లినా ప్లాస్టిక్ బాటిల్ లోని వాటర్ ని తాగుతున్నారు. వీటి వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది అని నిపుణులు అంటున్నారు. ప్లాస్టిక్ అనేది ఒక పాలిమర్. ఇందులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరైడ్ ఉంటాయి. అంతేకాకుండా ప్లాస్టిక్ లో బిపి అనే కెమికల్ ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా హాని చేస్తుంది.

వైద్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే రసాయనాలు పాలిమర్లలో ఉండే మూలకాలు శరీరంలోకి వెళితే కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటిని తాగితే చాలా తీవ్రమైన వ్యాధులు కలుగుతాయి. ముఖ్యంగా పురుషులకు హార్మోన్ సమస్యలు వస్తాయి. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడంతో కాలేయానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇక మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.

Drink in plastic water bottle can cause some diseases

Drink in plastic water bottle can cause some diseases

చాలామంది ప్లాస్టిక్ బాటిల్ లో ఉంచిన నీటిని తాగుతారు. అంతేకాదు నీటితో నింపిన బాటిల్స్ ను ఎక్కువ రోజులు ఫ్రిజ్లో పెట్టి తాగుతుంటారు. ఇలా చేయడం వలన ప్లాస్టిక్ బాటిల్లో ఉండే డిపిఏ ఇతర రసాయనాలు శరీరంలోకి వెళతాయి. అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్లాస్టిక్ బదులుగా రాగి పాత్రలు వాడితే మంచిది. మన పూర్వీకులు ఎక్కువగా రాగి పాత్రలను ఉపయోగించేవారు. రాగిలో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనివలన ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

saidulu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది