Cooling Water : చలికాలంలో కూడా కూలింగ్ వాటర్ తాగితే… ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…!!
ప్రధానాంశాలు:
Cooling Water : చలికాలంలో కూడా కూలింగ్ వాటర్ తాగితే... ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా...!!
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో కూడా ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతూ ఉంటారు. లేదంటే ఎండ కాస్త ఎక్కువగా ఉన్న కూలింగ్ వాటర్ తాగుతూ ఉంటారు. అయితే ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందులోనూ చలికాలంలో కూడా కూలింగ్ వాటర్ తాగితే అనారోగ్య సమస్యలు తప్పవు. అయితే ఈ కూలింగ్ వాటర్ తాగడం వలన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కూలింగ్ వాటర్ తాగడం వలన ఛాతిలో కఫం మరియు తలనొప్పి లాంటి సమస్యలు వచ్చి పడతాయి. అలాగే గొంతు మీద కూడా ఎంతో ఎఫెక్ట్ పడుతుంది…
ముఖ్యంగా చెప్పాలంటే కూలింగ్ వాటర్ తాగడం వలన వాయిస్ కోల్పోతారు. అలాగే జలుబు మరియు దగ్గు కూడా వస్తాయి. ఇకపోతే జలుబు అనేది ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బాగా తగ్గిపోతుంది. అంతేకాక మైగ్రేన్ లాంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. చలికాలంలో కూడా కూలింగ్ వాటర్ తాగితే గుండెపై మరింత ప్రభావం పడుతుంది. దీంతో హృదయ స్పందన రేటు అనేది మారుతుంది. అలాగే రక్తపోటు లాంటి సమస్యలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది….
కూలింగ్ వాటర్ జీర్ణక్రియను కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. అలాగే కూలింగ్ వాటర్ తాగితే తిన్న ఆహారం అనేది జీర్ణం కాదు. దీంతో అజీర్తి మరియు మలబద్ధకం లాంటి సమస్యలు మరింత పెరుగుతాయి.అంతేకాక దంతాల సమస్యలకు కూడా ఎక్కువ అవుతాయి. అలాగే దంతాల నరాలు అనేవి బలహీనం అవుతాయి