Drum Stick Plant : అబ్బో.. ఈ ఈ చెట్టుతో ఇన్ని ప్రయోజనాల.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ప్రధానాంశాలు:
Drum Stick Plant : అబ్బో.. ఈ ఈ చెట్టుతో ఇన్ని ప్రయోజనాల.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Drum Stick Plant : కూరగాయలు తినడం వలన మన శరీరానికి కావలసిన పోషకాలు అన్ని అందుతాయి. ప్రకృతి మనకు అందించే పండ్లు, ఆకులు, కూరగాయలు మానవ పోషణకు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇంకా ఎన్నో ఉపయోగాలు అందిస్తాయి. అటువంటి వాటిలో మునగ చెట్టు ఒకటి. ఈ మునగ చెట్టును ఒక అద్భుతమైన చెట్టుగా చెప్తారు.. వర్షాబావ పరిస్థితిలోనూ ఈ చెట్టు పెరిగి రైతులకు ఆదాయాన్ని తెచ్చి పెడితే ఒక మునగ కాయలు ఆకులు తిన్నవారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.. ఈ మునగలో ఎన్నో రకాల పోషకాలు ఉండి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే ఈ మునగ ఆకు రక్తహీనతకు చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది.
అయితే ఈ మునగ సాగు ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. ఈ మునగ తోటల పెంపకం చేపట్టి మంచి ఆదాయం ఆరోగ్యం జీవన ఉపాధి పొందవచ్చు అని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు.. ఈ మునగ తోటల పెంపకం వలన కలిగే ప్రయోజనాలపై అలాగే మునగ తోట విలువ ఆధారిత పదార్థాల తయారీ ద్వారా అధిక ఆదాయం ఎలా పొందవచ్చు.. అదిలాబాద్ లోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన అందించారు.. సహజంగా మునగ ఆకు రక్తహీనత సమస్యను తగ్గించడానికి వాడే ఐరన్ మాత్రలకు బదులుగా ప్రతిరోజు మునగాకు పొడి తీసుకున్నట్లయితే రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు.
మునగాకు పాలకంటే నాలుగు రెట్లు అధిక కాల్షియం రెండు రెట్ల అధికంగా జీర్ణం అయ్యే ప్రోటీన్లు ఉండటం వల్ల క్యాల్షియం ప్రోటీన్ సప్లమెంటుగా సహాయపడుతుందని వారు తెలిపారు.ఈ మునగ కాయలను పప్పులో వేసుకుని కానీ విడిగా వీటిని కూరగా కూడా వండుకొని తింటారు. ఇంకా మునగాకుతో రొట్టెలు, బిస్కెట్లు, తదితర వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు.. మునగ చెట్టు ఆకులు కాయలు గింజలలో మానవ పోషణకు కావాల్సిన అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఈ మునగ ఆకులలో పొటాషియం, జింక్, మెగ్నీషియం, ఇనుము రాగి లాంటి ఖనిజాలు అధికంగా ఉన్నాయి. ఈ మునగాకు, మునగ కాయలు ప్రతిరోజు ఆహారంలో చేర్చుకుంటే ఎటువంటి అనారోగ్యాలు మీ దరి చేరవు..