Dunpalu : చలికాలంలో ఇమ్యూనిటీని అమాంతం పెంచే దుంపలు.. వీటితో ఈ సమస్యలు దూరం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dunpalu : చలికాలంలో ఇమ్యూనిటీని అమాంతం పెంచే దుంపలు.. వీటితో ఈ సమస్యలు దూరం…!

 Authored By jyothi | The Telugu News | Updated on :3 December 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  Dunpalu : చలికాలంలో ఇమ్యూనిటీని అమాంతం పెంచే దుంపలు.. వీటితో ఈ సమస్యలు దూరం...!

Dunpalu : శీతాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలను చాలామంది ఎదుర్కొంటుంటారు.. ఈ సమయంలో ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది.. అయితే ఈ చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ ని బాగా పెంచుకోవాలి అన్న ఎటువంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలన్న ఈ దుంపలు తింటే చాలు.. మనకి దుంపలు అనగానే మొదటగా గుర్తొచ్చేది ఆలుగడ్డ. దుంపలు అంటే అడుగు భాగంలో పెరిగేవి.. బీట్రూట్, క్యారెట్లు, ఉల్లిపాయలు, చిలకడ దుంపలు, పసుపు ఇవన్నీ కూడా భూమి అడుగు భాగము నుంచి వస్తాయి. మిగతా మొక్కలు ఆహారం ఇవ్వడానికి నీరు పోషకాలను గ్రహిస్తూ ఉంటాయి. ఈ దుంపలు మాత్రం తీసుకున్నప్పుడు ఆ పోషకాలు మన శరీరానికి అందుతాయి. దుంప కూరల్లో మనకి కావాల్సిన అన్ని విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడతాయి. చలికాలంలో అనారోగ్యాల నుంచి కాపాడడానికి ఈ దుంపలు ఉపయోగపడతాయి. ఈ దుంపలలో యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఈ చలికాలంలో ఎక్కువ వచ్చే ఇన్ఫెక్షన్లు, జలుబులు నుంచి మనల్ని రక్షిస్తాయి. చలికాలంలో మనం ఎలాంటి దుంపలు తీసుకోవాలో చూద్దాం…

బీట్రూట్: బీట్రూట్లో నైట్రేట్ అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువ సమయం పాటు శక్తివిస్తూ ఉంటాయి. ఈ దుంపల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత రాకుండా చేస్తుంది. బీట్రూట్ రసం చక్కటి డీటెక్స్ లాగా ఉపయోగపడుతుంది..చిలకడ దుంపలు: ఈ చిలకడదుంపల్లో బీటా కెరోటిన్ ,విటమిన్ సి, పొటాషియం, ఐరన్ అధికంగా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ ఏ వంటివి కంటిచూపుని మెరుగుపరుస్తాయి. ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి. రోగ నిరోధక వ్యవస్థను కీలకమైన తెల్లరక్త కణాల ఉత్పత్తికి ఉపయోగపడతాయి..

ముల్లంగి: ఈ ముల్లంగిలో ఫైబర్, జింక్, పొటాషియం, కాపర్, కాలుష్యం, మాంగనీస్, పుష్కలంగా ఉంటాయి. ఈ ముల్లంగితో కంటిచూపు బాగా మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.. క్యారెట్స్; ఈ క్యారెట్లు పొటాషియం, కాల్షియం, ఐరన్ ఏ,సీ,కే, బి విటమిన్లు లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఈ క్యారెట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యారెట్ లోని బీటా క్యారెట్ కంటిచూపులు మెరుగుపరుస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ జీర్ణ క్రియ కు మేలు చేస్తుంది. క్యారెట్ లో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కాంతివంతంగా మారుస్తుంది..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది