Elephant Yam : ఇమ్యూనిటీ బాగా పెరగాలా..? ఈ ఒక్క కూరగాయ తీసుకోండి చాలు… మరో 10 లాభాలు కూడా మీ సొంతం…!
ప్రధానాంశాలు:
Elephant Yam : ఇమ్యూనిటీ బాగా పెరగాలా..? ఈ ఒక్క కూరగాయ తీసుకోండి చాలు... మరో 10 లాభాలు కూడా మీ సొంతం...!
Elephant Yam : మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల పోషకాలు మన శరీరానికి అందివ్వాలి. కొన్ని పోషకాలు మన శరీరానికి అందితే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.. మనం తీసుకునే కొన్ని ఆహారాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొంతమంది కూరగాయలు తినడానికి అసలు ఇష్టపడరు. అయితే కూరగాయలలో మంచి పోషక విలువలు ఉంటాయి.. కొంతమంది ఈజీగా అయ్యే కూరగాయలను వండుతూ ఉంటారు. మిగతా వాటిని పట్టించుకోరు. ఇలా చాలామంది తినకుండా ఉండే వాటిలలో కందగడ్డ కూడా ఒకటి.
కొంతమందికి అసలు ఈ కూరగాయ గురించి తెలిసి ఉండదు. కంద గడ్డలో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ కందగడ్డ తీసుకుంటే చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు… అయితే కంద గడ్డతో కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. చర్మం అందంగా మెరుస్తుంది: కంద గడ్డలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. దీనిలోని విటమిన్లు బి6 లాంటివి ఉంటాయి. దీని తీసుకోవడం వలన మీ చర్మం ముడతలు లేకుండా మృదువుగా తయారవుతుంది. అలాగే జుట్టు ఎదుగుదలకు కూడా ఎంత బాగా ను ఉపయోగపడుతుంది. ఈ కందగడ్డను ప్రతిరోజు తీసుకుంటే మీరు అందంగా మెరిసిపోతారు.
కొలెస్ట్రాల్కు చెక్ : కొంతమంది ప్రస్తుతం శరీరంలో కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల బరువు పెరగడంతో పాటు గుండె సమస్యలు కూడా వస్తుంటాయి. ఇంకా ఇతర సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ కందగడ్డను ప్రతిరోజు తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. కందగడ్డలో ఫైబర్ కంటెంట్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. శరీరంలో ఉన్న కొవ్వులు కరిగిస్తుంది.. అధిక బరువు ఉన్నవారు కూడా బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఈ కందగడ్డను పిల్లలకి పెట్టినట్లయితే కడుపులో నులిపురుగుల సమస్య తగ్గిపోతుంది.