Sleeping : తక్కువ సమయం నిద్రపోతున్నారా… అయితే ఈ ప్రమాదం తప్పదు…!
ప్రధానాంశాలు:
Sleeping : తక్కువ సమయం నిద్రపోతున్నారా... అయితే ఈ ప్రమాదం తప్పదు...!
Sleeping : మనం ఉన్న ఈ ప్రస్తుత కాలంలో యువత రాత్రి టైమ్ లో మెలుకువగా ఉంటున్నారు. దీనికి కారణంగా కొంతకాలం తరువాత వారికి సరిగ్గా నిద్ర అనేది పట్టదు. నిద్ర లేకపోవడం వలన నిద్ర సమస్యలు ఎదురవుతాయి. ఇది గుండె సమస్యల ప్రమాదంతో పాటుగా, మానసిక, శారీరక సమస్యలతో సహా ఇతర వ్యాధులకు సంబంధించిన ప్రమాదాలను కూడా పెంచుతుంది. నిజానికి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే. 7 నుంచి 8 గంటల పాటు నిద్ర అనేది అవసరం. అయితే మీకు గనక రాత్రి టైంలో నిద్ర లేకపోతే దానిని ఏమాత్రం తెలీకగా తీసుకోకండి. ఎందుకు అంటే. దాని ప్రత్యక్ష సంబంధం గుండే ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది కాబట్టి. పరిశోధన ప్రకారం చూస్తే. మంచి నిద్రలేని చాలామంది వ్యక్తులు నిద్రలేని సమస్యలతో బాధపడుతున్నారు. వారిలో గుండె సమస్యలు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు నిద్ర రుగ్మతతో ఎంతో బాధ పడుతున్నారు అని దీని ఫలితంగా ప్రమాదకరమైన సమస్యలు, ఎన్నో వ్యాధులకు సంబంధించిన సమస్యలు చుట్టుముడుతున్నాయి. నిద్ర సమస్యలు గుండె ఆరోగ్యానికి సంబంధం ఏమిటి. నిద్ర లేకపోవడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
నిద్ర లేకపోవడం వలన ఎక్కువగా గుండె సమస్యలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఎవరైనా 8 గంటల నిద్ర లేకపోతే శరీరంలో కార్టిసాల్ హార్మోన్ పెరగటం మొదలవుతుంది. దీనివలన గుండెపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. అంతేకాక ఇది రక్తపోటును కూడా పెంచుతుంది. ఇది గుండె సమస్యలకు కూడా దారితీస్తుంది. దీంతో గుండెపోటు ముప్పు అనేది పెరుగుతుంది. మీకు తగినంత నిద్ర లేకపోవడం వలన వాపు, ఒత్తిడి ని పెంచే హార్మోన్లు శరీరంలో పెరగటం మొదలవుతాయి. ఈ వాపు అనేది ధమనికి కూడా హాని కలిగించవచ్చు. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.
నిద్ర లేకపోవడం వల్ల గుండె కొట్టుకోవటం అనేది సక్రమంగా ఉండదు. గుండే చప్పుడులో మార్పులు సంభవించే అవకాశాలు ఉంటాయి. దీనిని అరిథ్మియ అని పిలుస్తారు. ఇది గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాలను పెంచుతుంది. అందుకే రాత్రి పూట ఎక్కువసేపు మెలకువగా ఉండకూడదు. పూర్తిగా నిద్రపోవడం చాలా మంచిది. రాత్రిపూట ఎక్కువ టైం నిద్ర పోకుండా ఉండే వారికి అతిగా తినటం కూడా అలవాటు అవుతుంది. పెలవమైన నిద్ర వలన ఆకలి పెరుగుతుంది. ఎందుకు అంటే. ఇది ఆకలి పెంచే హార్మోన్ ను రిలీజ్ చేస్తుంది. ఇది ఊబకాయ ప్రమాదాలను కూడా పెంచుతుంది. గుండే సమస్యలకు ప్రధాన కారణం అధిక బరువు. కాబట్టి జీవన శైలిలో మార్పులు చేయటం వలన ఈ ప్రమాదాల నుండి బయటపడవచ్చు. నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులలో గుండె ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది స్ట్రోక్ మరియు గుండె జబ్బుల ప్రమాదాలను పెంచుతుంది. మంచి గుండె ఆరోగ్యానికి సరైన నిద్ర చాలా అవసరం. కాబట్టి నిద్ర నాణ్యతపై సరైన శ్రద్ధ పెట్టాలి…