Fruit Benefits : ఇప్పటివరకు ఎవరికీ తెలియని సమ్మర్ బెస్ట్ ఫ్రూట్ ఇది .. దీని లాభాలు తెలిస్తే ఎంత రేటు అయినా కొనుక్కొని తింటారు ..!!
Fruit Benefits : వేసవికాలం అనగానే మనకు మామిడి పుచ్చకాయ కర్పూజ పండు ఎక్కువగా గుర్తొస్తాయి. కానీ ఫాల్స్ పండు కూడా యేసయ్య కాలంలో పండే పండు అని ఎవరికి తెలియదు.ఫాల్సా పండ్లను ఇండియన్ షెర్బెత్ బెర్రీ అని కూడా పిలుస్తుంటారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఈ పండ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. ఇండియాలో దీనిని సమ్మర్లో రిప్రెష్ డ్రింక్ గా వినియోగిస్తారు. ఇది టేస్టీగా ఉండటమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఫాల్సా పండ్లలో విటమిన్ సి ఐరన్ క్యాల్షియం ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి. విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది.
రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడానికి, గాయాలను నయం చేయడానికి సహాపడుతుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు ఐరన్ చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు కాల్షియం, ఫాస్పరస్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ పండులో శరీరాన్ని బలపరిచే గుణాలు ఉంటాయి. ఇది శరీరంలోని వేడిని తగ్గించడంతోపాటు శీతలీకరణ సామర్థ్యాన్ని పెంచుతుంది. వడదెబ్బ నుంచి కాపాడుతుంది. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాదు హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. అందుకే దీనిని సమ్మర్ బెస్ట్ ఫ్రూట్ అని అంటారు.
ఫాల్సాలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుంచి గుండెను రక్షిస్తాయి. ఈ పండ్లలోని ఫ్లేవనాయిడ్స్ గుండె సమస్యలు రాకుండా రక్షిస్తాయి. అదనంగా, ఫాల్సాలో పొటాషియం ఉంటుంది, ఇది బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. ఫాల్సా పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది. ఫాల్సాలో ఆంథోసైనిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. శరీరంలో మంటను తగ్గిస్తాయి. షుగర్ భాదితులు ఈ పండ్లు తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.