Fenugreek Seeds : మెంతులను ఇలా వాడితే చాలు… తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టినట్లే…??
Fenugreek Seeds : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న సాధారణ సమస్యలలో తెల్లజుట్టు కూడా ఒకటి. అయితే ఈ తెల్ల జుట్టు సమస్యలకు ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ తెల్ల జుట్టుకు కొన్ని ఇంటి నివారణ చిట్కాలను పాటిస్తే, మళ్లీ మీ జుట్టు నల్లగా మారుతుంది. దీనికోసం మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే మెంతులు మన ఆహారంలో భాగం చేసుకోవటం వలన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు అనేవి అందుతాయి. అలాగే ఈ […]
ప్రధానాంశాలు:
Fenugreek Seeds : మెంతులను ఇలా వాడితే చాలు... తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టినట్లే...??
Fenugreek Seeds : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న సాధారణ సమస్యలలో తెల్లజుట్టు కూడా ఒకటి. అయితే ఈ తెల్ల జుట్టు సమస్యలకు ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ తెల్ల జుట్టుకు కొన్ని ఇంటి నివారణ చిట్కాలను పాటిస్తే, మళ్లీ మీ జుట్టు నల్లగా మారుతుంది. దీనికోసం మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే మెంతులు మన ఆహారంలో భాగం చేసుకోవటం వలన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు అనేవి అందుతాయి. అలాగే ఈ మెంతులలో ప్రోటీన్స్ మరియు ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ లాంటి కనీజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే అధిక బరువుతో ఇబ్బంది పడేవారు కూడా తరచుగా మెంతులను తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు. వీటితో పాటుగా జీర్ణ సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి…
ఈ మెంతులనేవి ఆరోగ్యంతో పాటుగా జుట్టుకు కూడా ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. ఇది మీ జుట్టును వేర్ల నుండి నల్లగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే ఈ మెంతులలో ఐరన్ మరియు ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జుట్టుకు పోషకాలను ఇవ్వటమే కాక మీ జుట్టు నెరిసిపోకుండా కూడా చూస్తాయి. అలాగే జుట్టు రాలే సమస్యను తగ్గించటంతో పాటు జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తాయి. అలాగే ఈ మెంతులలో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. అయితే ఇవి తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయ పడతాయి. ఈ మెంతులను నీళ్లలో నానబెట్టుకుని తాగటం అలవాటు చేసుకుంటే క్రమంగా మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. దీంతో సహజంగానే మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు…
దీనికోసం రాత్రి పడుకునే ముందు ఒక చెంచా మెంతులను ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఉదయం లేచిన వెంటనే ఈ నీళ్లను ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేయడం వలన మీ తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుంది. అలాగే ఒక కప్పు మెంతులను రాత్రి నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయం లేచిన వెంటనే ఆ నీళ్లలో కొద్దిగా ఉప్పు మరియు నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు అనేవి బయటకు పోతాయి. దానితోపాటు ఆ రోజంతా కూడా మీరు ఎంతో హుషారుగా ఉంటారు. ఈ మెంతులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పీచు పదార్థాలు అనేవి జీర్ణవ్యవస్థ పని తీరుకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే కడుపు నొప్పి మరియు కడుపు ఉబ్బరం లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి