Stroke : ఈ పానీయాలు స్ట్రోక్ ప్రమాదాలను ఎందుకు పెంచుతాయో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Stroke : ఈ పానీయాలు స్ట్రోక్ ప్రమాదాలను ఎందుకు పెంచుతాయో తెలుసా…!!

Stroke : మన గుండే ఆరోగ్య విషయాని కొస్తే మాత్రం మనం ఏం తింటున్నామో మరియు ఏం తాగుతున్నాము అనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అయితే కార్బోనేటెడ్ పానియాలు మరియు పండ్ల రసాలు తాగడం వలన మన శరీరంలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని మీకు తెలుసా. అయితే రోజుకు నాలుగు కప్పుల కాపీని తాగినా కూడా స్ట్రోక్ కు దారితీస్తుంది అని ఒక అధ్యయనంలో తేలింది. అయితే ఈ పరిశోధనలో తేలిన ఆశ్చర్యకరమైన […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 October 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Stroke : ఈ పానీయాలు స్ట్రోక్ ప్రమాదాలను ఎందుకు పెంచుతాయో తెలుసా...!!

Stroke : మన గుండే ఆరోగ్య విషయాని కొస్తే మాత్రం మనం ఏం తింటున్నామో మరియు ఏం తాగుతున్నాము అనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అయితే కార్బోనేటెడ్ పానియాలు మరియు పండ్ల రసాలు తాగడం వలన మన శరీరంలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని మీకు తెలుసా. అయితే రోజుకు నాలుగు కప్పుల కాపీని తాగినా కూడా స్ట్రోక్ కు దారితీస్తుంది అని ఒక అధ్యయనంలో తేలింది. అయితే ఈ పరిశోధనలో తేలిన ఆశ్చర్యకరమైన విషయాలు ఏమిటి అంటే. మనం సాధారణంగా నాలుగు కప్పుల వరకు కాఫీని తాగుతాం. అయితే ఇంతకంటే ఎక్కువ కాఫీని తాగితే స్ట్రోక్ ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి అని అంటున్నారు. అంతేకాక ప్రజలు శీతల పానీయాలు మరియు ఫ్రిడ్జ్ డ్రింక్స్ తాగేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే విటిని తీసుకోవటం వలన ఆరోగ్యని కి ఎంత ప్రమాదమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాక మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి ఎలాంటి పద్ధతులు పాటించాలో కూడా తెలుసుకుందాం…

Stroke పరిశోధన ఏం చెబుతుందంటే

మైక్ మాస్టర్ యూనివర్సిటీ కెనడా మరియు యూనివర్సిటీ ఆఫ్ గాల్వే కి సంబంధించినటువంటి బృందం కాఫీ లేక ఇతర శీతల పానీయాల పై కొన్ని పరిశోధనలు చేశారు. అయితే ఈ పరిశోధన ప్రకారం చూస్తే, కార్బోనేటెడ్ డ్రింక్ లేక పండ్ల రసాలు తరచుగా తాగడం వలన స్ట్రోక్ రిస్క్ అనేది 37 శాతం వరకు పెరుగుతుంది. అలాగే మరొక అధ్యయనం ప్రకారం చూస్తే, చక్కెరతో తయారు చేసినటువంటి కార్బోనేటెడ్ పానీయాలు స్ట్రోక్ ప్రమాదాలను 22 శాతం వరకు పెంచుతాయి. అయితే ఈ పరిశోధన అనేది జనరల్ ఆఫ్ స్ట్రోక్ మరియు ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ స్ట్రోక్ లో ప్రచురించారు. అయితే ఈ ప్రాజెక్టులో 27 దేశాల నుండి 27 వేల మందిని తీసుకున్నారు. అయితే దీనిలో 13,500 మంది మొదటిసారిగా స్ట్రోక్ ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. అయితే ఇటువంటి పరిస్థితులలో అధికంగా స్ట్రోక్ ప్రమాదాలను పెంచే ఈ పానీయాలలో ఏమి ఉన్నాయి అనే ప్రశ్న తలెత్తుతుంది.

ఈ పానీయాలు స్ట్రోక్ ప్రమాదాలను ఎందుకు పెంచుతాయి అంటే : తరచుగా ఫ్రిడ్జ్ డ్రింక్స్ లేక కాఫీని తాగటం వలన స్ట్రోక్ ఎందుకు వస్తుంది అనే విషయంలో నిపునుల అభిప్రాయం చూసినట్లయితే, మన మెదడులో ఏదైనా భాగానికి రక్తం సరఫరా సరిగ్గా జరగకపోతే లేక మెదడు కణాలు అనేవి దెబ్బతిన్నప్పుడు స్ట్రోక్ అనేది వస్తుంది. అలాగే ఇలాంటి పరిస్థితులలో ఇస్కీమిక్ స్ట్రోక్ కూడా రావచ్చు. సాధారణంగా ఇది రక్తం గడ్డ కట్టడం వల్ల సంభవిస్తుంది. దీని వల్ల మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. అయితే ఫ్రిడ్జ్ డ్రింక్స్ లేక ప్యాకేజ్ ఫ్రూట్ జ్యూస్ లో ఎక్కువ చక్కెర మరియు ఫ్రిజర్వేటివ్ అనేవి ఉంటాయి అని పరిశోధనలో తేలింది. అందుకే వీటిని ఎక్కువగా తాగటం వలన షుగర్ అనేది బాగా పెరుగుతుంది. దీని కారణం చేత స్ట్రోక్ ప్రమాదం కూడా బాగా పెరుగుతుంది. అంతేకాక ఉబకాయం లేక ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న స్త్రీలు మరియు వ్యక్తులలో స్ట్రోక్ ప్రమాదాలు కూడా ఎక్కువగా పెరుగుతాయి.

Stroke ఈ పానీయాలు స్ట్రోక్ ప్రమాదాలను ఎందుకు పెంచుతాయో తెలుసా

Stroke : ఈ పానీయాలు స్ట్రోక్ ప్రమాదాలను ఎందుకు పెంచుతాయో తెలుసా…!!

ఏ పానీయాలు తాగొచ్చు అంటే : కాఫీ మరియు టీ ని చాలామంది తాగకుండా ఉండలేము అని అంటారు. అయితే వీటి ఉపయోగాన్ని కచ్చితంగా తగ్గించవచ్చు. అయితే కాఫీ మరియు టీ కి బదులుగా గ్రీన్ టీ మరియు హెర్బల్ టీ తాగొచ్చు. ఎందుకు అంటే ఇది హానికరమైనవి కాదు కాబట్టి. అలాగే పాలకు బదులుగా బాదంపాలు మరియు సోయా పాలు, ఓట్స్ తో చేసిన ఫోర్టీఫైడ్ పాలను తాగొచ్చు…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది