Monsoons : వానాకాలంలో పచ్చళ్ళు పడవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ ని ఫాలో అవ్వండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Monsoons : వానాకాలంలో పచ్చళ్ళు పడవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ ని ఫాలో అవ్వండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Monsoons : వానాకాలంలో పచ్చళ్ళు పడవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ ని ఫాలో అవ్వండి...!

Monsoons : తెలుగువారికి పచ్చళ్ళు మరియు ఊరగాయ అంటే ఎంతో ఇష్టం. అందుకే రకరకాల పచ్చళ్ల ను ఎప్పుడూ పెట్టుకుంటూ ఉంటారు. ఆవకాయ, మాగాయ, టమాట, గోంగూర పచ్చళ్ల ను అధికంగా పెడుతూ ఉంటారు. వీటిలో చాలావరకు ప్రజలు నిల్వ పచ్చళ్ల ని ఎక్కువగా పెడుతూ ఉంటారు. వేడివేడి అన్నం లేక రోటీలో ఈ ఊరగాయ వేసుకున్నట్లయితే ఆ టెస్ట్ వేరు. ఎవరికైనా సరే నోరు ఊరాల్సిందే. భారతీయ ఊరగాయకు ఒక ప్రత్యేకమైన మరియు స్థిరమైన స్థానం అనేది ఉన్నది. సాధారణంగా మనకు కావలసిన భోజనం దొరికినప్పుడు మనం ఏ ఇతర వంటకం వైపు కూడా తిరిగి చూడము. మనం ఎప్పుడూ ఇంట్లో మనకు నచ్చినది ఏదైనా ఉంది అనుకుంటే అది వంటగదిలోని ఆవకాయ. అన్నిటిలో మొదటి ఎంపిక కూడా ఊరగాయ. కానీ ఊరగాయ పెట్టగానే సరిపోదు. వాటికి బూజు అనేది పట్టకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఎంతో జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలి. వర్షాకాలంలో కాస్త ఆ జాగ్రత్త చేసినట్లయితే ఈ పచ్చళ్ళు అనేవి తొందరగా పాడు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చళ్ళు బూజు పట్టకుండా నిలువ చేసుకునేందుకు సరైన పద్ధతిని ఇక్కడ మనం తెలుసుకుందాం..

మీరు గనక ఊరగాయను చేసినప్పుడు ఊరగాయ తయారిలో ఉపయోగించేటటువంటి పదార్థాలు సరిగ్గా ఎండబెట్టుకొని ఉపయోగించుకోవాలి. లేకుంటే వర్షాకాలంలోని వాతావరణ తేమ ఎక్కువగా ఉండటం వలన నీరు అనేది చేరి తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కావున ఫంగస్ వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. ఎక్కువ నూనె ఉప్పును జోడించాలి : ఈ ఊరగాయలలో నూనె మసాలాలు లేకపోవడం వలన దీనిలో ఫంగస్ అనేది చేరుతుంది. అలాగే ఊరగాయ లో ఉప్పు మరియు నూనె సరిగ్గా లేకపోవడం వల్ల కూడా అది తొందరగా పాడవుతుంది. కావున వర్షాకాలంలో తేమ నుండి ఊరగాయను రక్షించేందుకు అదనపు ఉప్పు మరియు నూనెను విడిగా పోయాల్సి ఉంటుంది. అలాగే ఊరగాయ లు సరిగ్గా మునిగేలా కూడా చూసుకోవాలి.

Monsoons వానాకాలంలో పచ్చళ్ళు పడవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ ని ఫాలో అవ్వండి

Monsoons : వానాకాలంలో పచ్చళ్ళు పడవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ ని ఫాలో అవ్వండి…!

పచ్చళ్లు ఇలా నిల్వ చేయండి : మీకు అసలైన పని ఊరగాయ చేసిన తర్వాత మాత్రం మొదలవుతుంది. ఊరగాయ ఎక్కువ కాలం రుచిగా ఉండాలి అన్న, ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండాలి అన్న ఊరగాయను సరిగ్గా నిల్వ ఉచ్చటం ఎంతో ముఖ్యం. ఊరగాయను నిల్వ చేసేందుకు గాలిచొరబడని,పూర్తిగా పొడి కంటైనర్ లేక జాడీల ను వాడటం మంచిది. ఊరగాయను నిల్వ చేసేందుకు ఎప్పుడు కూడా గాజు లేక పింగాణి పాత్రలను ఉపయోగించాలి. ఉక్కు పాత్రలు మరియు ప్లాస్టిక్ డబ్బాలలో ఈ ఊరగాయలను నిల్వ ఉంచటం మంచిది కాదు. ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి : ఊరగాయను సర్వ్ చేసుకునేటప్పుడు మీరు జాడీలో ఉంచినటువంటి చెంచా ఎప్పుడు కూడా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు ఊరగాయను పెట్టేముందు మనకు కావలసినంత పచ్చడిని కాస్త వేరుగా తీసుకొని ఒక చిన్న కంటైనర్ లో ని ల్వ చేసుకుంటే మంచిది. ఊరగాయ తక్కువ పరిమాణంలో ఉన్నట్లయితే మీరు దానిని ఫ్రిజ్లో నిల్వ చేసిన కూడా మంచిగా ఉంటుంది. అంతేకాక ఊరగాయలో వేసిన మసాలా దినుసులు వేయించిన తర్వాత దానిలోని తేమా అనేది ఆవిరి అవుతుంది. అలాగే వర్షాకాలంలో కూడా వీటిని ఎండలో ఉంచడం మంచిది. ఊరగాయ వింత వాసన లేక ఫంగస్ అని అనిపించినట్లయితే మొదట చేయవలసినది ఏమిటి అంటే. అది చెడిపోయిందో లేదో ముందు చెక్ చేసుకోవాలి. కంటైనర్ అంతట ఫంగస్ వ్యాపించినట్లయితే ప్రభావిత ప్రాంతాన్ని తీసివేసి ఊరగాయను ప్రత్యేక కంటైనర్ లో నిల్వ చేయండి. ఇప్పుడు వైట్ వెనిగర్ తో మిక్స్ చేసి రెండు వారాల పాటు ఎండలో ఉంచాలి…

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది