Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??
ప్రధానాంశాలు:
Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు...??
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు ఈ చలి అనేది ఇంకా మరింత తీవ్రం అవుతుంది. అయితే పొద్దున్నే లేచిన వెంటనే స్నానం చేసే అలవాటు ఉన్నవారికి చలికాలంలో ఉదయాన్నే చల్లటి నీళ్లతో స్నానం చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే చాలామంది నీటిని వేడి చేసుకోవడానికి గీజర్ ను వాడుతూ ఉంటారు. అయితే ఈ గీజర్ ను వాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ గీజర్ వలన కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే గీజర్లు వాడేటప్పుడు ఎంతో జాగ్రత్త తీసుకోవాలి…
గీజర్ ను ఆన్ చేసినప్పుడు నీరు కొన్ని నిమిషాల వ్యవధిలోనే వేడెక్కుతాయి. దీంతో మీరు ఈజీగా స్నానం చేయొచ్చు. కానీ చాలా సార్లు దీనిని ఆన్ చేసిన తర్వాత వెంటనే ఆఫ్ చేయటం మర్చిపోతారు. దీనిని ఎక్కువ సమయం పాటు ఆన్ చేసి ఉంచటం అంత మంచిది కాదు. ఇలాంటి సందర్భంలో గీజర్ అనేది పేలుతుంది. అందుకే మీరు గీజర్ ని వాడినప్పుడు ఎక్కువ సేపు ఆన్ చేయకుండా చూసుకోవాలి. నీళ్లు వేడి ఎక్కిన వెంటనే ఆఫ్ చేయాలి. సాధారణంగా డబ్బు ఆదా చేసుకోవడానికి తక్కువ ధరలో గీజర్ ను కొనుక్కుంటూ ఉంటారు. తర్వాత అది చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది.
ఎందుకు అంటే స్థానిక కంపెనీల గీజర్లలో భద్రత ప్రమాణాలు అనేది అస్సలు ఉండవు. ఇలాంటి గీజర్లు తొందరగా పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో ప్రమాదాల భయాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే గీజర్ ను కొనుక్కునేటప్పుడు బ్రాండెడ్ కంపెనీల నుండి మాత్రమే గీజర్లు తీసుకోవాలి. ఈ గీజర్ ను బాత్రూంలో సరైన స్థానంలో ఇన్స్టాల్ చేయడం చాలా అవసరం. ఎందుకు అంటే చాలా వరకు గీజర్ ప్రమాదాలు అనేవి గీజర్ మీద పడటం వలన జరుగుతాయి. అందుకే ఈ గీజర్ ను బాత్రూం పై భాగంలో నీరు చేరని చోట అమార్చాలి . Geyser usage in winter do not forget these important things