Winter Season : చలికాలంలో తేనెను తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే… తప్పకుండా తెలుసుకోండి…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Winter Season : చలికాలంలో తేనెను తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే… తప్పకుండా తెలుసుకోండి…??

 Authored By ramu | The Telugu News | Updated on :6 November 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Winter Season : చలికాలంలో తేనెను తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే... తప్పకుండా తెలుసుకోండి...??

Winter Season : తేనె ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మన అందరికీ తెలిసిందే. అలాగే ఈ తేనెను చలికాలంలో తీసుకుంటే జలుబు మరియు దగ్గు నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. అలాగే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇకపోతే రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. అలాగే అజీర్తి మరియు కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి. అంతేకాక రక్తంలో హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. ఇకపోతే గుండె ముప్పు మరియు చర్మం, దంతాలకు సంబంధించినటువంటి సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. అయితే ఈ తేనె లో ఔషధ గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ తేనెలో మెగ్నీషియం మరియు ఐరన్, కాల్షియం లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తేనె లో ఉండే గుణాలు అనేవి అంటూ వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి…

ప్రతిరోజు తేనెను తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి అనేది ఎంతగానో పెరుగుతుంది. ఈ తేనెతో జలుబు మరియు దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలను కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. గోరువెచ్చని నిమ్మకాయ నీటిలో కొద్దిగా తేనెను కలుపుకొని తాగితే శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఒక స్పూన్ తేనె మరియు అర స్పూన్ లవంగాల పొడిని కలిపి తీసుకుంటే మరీ మంచిది. వాటిలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియాల్ మరియు యాంటీ యాక్సిడెంట్ గుణాలు రోగని రోధక శక్తిని పెంచుతాయి. అలాగే దగ్గు మరియు గొంతు నొప్పి, జలుబు లాంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది. అలాగే హెర్బల్ టీ లో తేనెను కలిపి తీసుకుంటే మానసిక సమస్యలు కూడా తొందరగా తగ్గుతాయి. అంతేకాక శరీరంలో పేర్కొన్నటువంటి వ్యర్ధాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. అలాగే తేనెను తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. అంతేకాక మలబద్ధకం మరియు కడుపుకు సంబంధించిన సమస్యలను దూరం చేయడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది…

Winter Season చలికాలంలో తేనెను తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే తప్పకుండా తెలుసుకోండి

Winter Season : చలికాలంలో తేనెను తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే… తప్పకుండా తెలుసుకోండి…??

మీరు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగితే మలబద్ధకం మరియు అజీర్తి లాంటి సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. అంతేకాక రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ మరియు ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే సైనస్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ప్రతినిత్యం ఉదయాన్నే ఒక స్పూన్ తేనె మరియు అర స్పూన్ దాల్చిన చెక్క పొడి మరియు అర స్పూన్ అల్లం రసం కలుపుకొని తీసుకుంటే శరీరంలో పేర్కొన్న కొవ్వు ఈజీగా కరుగుతుంది. ఇలా మీరు చలికాలంలో ప్రతినిత్యం తేనెను తీసుకోవటం వలన సుఖంగా నిద్రపోవచ్చు. దీంతో ఒత్తిడి అనేది దూరం అవుతుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది