Ginger Tea : టీ చేస్తున్నప్పుడు ఈ నాలుగు విషయాలు గుర్తు పెట్టుకుంటే టీ టెస్ట్ అదిరిపోద్ది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ginger Tea : టీ చేస్తున్నప్పుడు ఈ నాలుగు విషయాలు గుర్తు పెట్టుకుంటే టీ టెస్ట్ అదిరిపోద్ది…!!

Ginger Tea : ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన టీ ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం.. అయితే చాలామందికి టీ అన్నిసార్లు ఒకే విధంగా కుదరదు.. అయితే చాలామందికి కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. టీలో ఎక్కువ పాలు పోయాలా.. టీలో చక్కెర ఎంత వేస్తే సరిపోతుంది. లేదా టీ చిక్కదనం కోసం ఏం వాడాలి. అని ఎన్నో రకాల డౌట్స్ చాలా మనస్లో ఉంటాయి. అయితే ఇప్పుడు చిక్కని టెస్ట్ అయిన టీ ఎలా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :23 January 2023,7:00 am

Ginger Tea : ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన టీ ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం.. అయితే చాలామందికి టీ అన్నిసార్లు ఒకే విధంగా కుదరదు.. అయితే చాలామందికి కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. టీలో ఎక్కువ పాలు పోయాలా.. టీలో చక్కెర ఎంత వేస్తే సరిపోతుంది. లేదా టీ చిక్కదనం కోసం ఏం వాడాలి. అని ఎన్నో రకాల డౌట్స్ చాలా మనస్లో ఉంటాయి. అయితే ఇప్పుడు చిక్కని టెస్ట్ అయిన టీ ఎలా తయారు చేయాలో మనం తెలుసుకోబోతున్నాం… టీ తయారీ విధానం కోసం : కావలసిన పదార్థాలు : నీళ్లు, పాలు, చక్కెర, అల్లం, టీ పౌడర్, లవంగాలు,యాలకులు మొదలైనవి…

తయారీ విధానం : ముందుగా ఈ మసాలా టీ కోసం మూడు యాలకుల్ని తీసుకొని రోట్లో వేసుకుని దంచుకోవాలి. ఈ యాలకులు దంచిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే రోట్లో 4 5 ఇంచల అల్లం కూడా పొట్టు తీసి దానిని కూడా దంచుకోవాలి. ఇక అల్లం కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై టీ గిన్నెను పెట్టుకుని దానిలో మూడు గ్లాసుల వాటర్ న్ని పోసి ముందుగా దంచి పెట్టుకున్న అల్లం ముక్కలు లవంగాలు, యాలకులు వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత బాగా వాటర్ చేంజ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఆ విధంగా మరుగుతున్న నీటిలో మూడు స్పూన్ల టీ పౌడర్ ని వేసి కలుపుకోవాలి.

Ginger tea with tips

Ginger tea with tips

తర్వాత మూడు స్పూన్ల చక్కెర ని వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుతూ బాగా మరిగించుకోవాలి. డికాషన్ బాగా మరిగిన తర్వాత మూడు గ్లాసుల పాలు పోసుకోవాలి. ఈ పాలు రూమ్ టెంపరేచర్లో ఉండాలి. పాలు డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో నుంచి తీసి అసలు పోసుకోకూడదు. రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలైతేనే టీ కి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే చిక్కదనం కూడా ఉంటుంది. ఇక కాసేపు బాగా మరగనివ్వాలి. అలా మరిగిన టీని తీసి చక్కగా గ్లాసుల్లో వడకట్టుకుని వేడివేడిగా తాగాలి. అంతే ఎంతో సింపుల్ గా చిక్కని టీ అలాగే ఎంతో టేస్టేఅయిన టీ రెడీ. ఈ టిప్స్ తో టీ ని చేసుకుంటే ఎప్పుడు ఒకటే లాగా చాలా చిక్కగా టేస్టీగా ఉంటుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది