Cycling : సైకిల్ తొక్కే వారికి శుభవార్త..! మానసిక ఆందోళనల కు చెక్ … ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా…?
Cycling : ప్రస్తుత కాలంలో మానవాళి జీవితంలో ఒత్తిడితోను బిజీ అయిపోతున్నారు, అలాగే శారీరక శ్రమ ఏమాత్రం లేదు. కూర్చున్న చోటు నుంచి కదలకుండా పనిచేసే వారికి, బద్ధకం ఎక్కువ పోయినవారికి ఏమాత్రం శరీరం అలసటకు గురి కావడం లేదు. వీరికి శరీర వ్యాయామం అస్సలు లేదు. రోజువారి దినచర్యలో ఒక క్రమ పద్ధతి లేదు. దీనివల్ల వీరికి ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి. అటువంటి వారి కోసం సైకిల్ తొక్కడం అనేది ఒక అద్భుత అస్త్రం. అయితే సైకిల్ తొక్కితే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సైకిల్ వల్ల మన శరీరమునకు మంచి వ్యాయామం అవుతుంది. అయితే సైకిల్ శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఈ సైకిల్ వల్ల మనలోనే మానసిక ఆందోళన దూరం చేస్తుంది. సైక్లింగ్ ని ఎలాగైనా చేయవచ్చు ఇంట్లో అయినా బయటైనా. శరీరానికి మంచి వ్యాయామంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం….
Cycling : మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం
మనం సైకిల్ ని తొక్కేటప్పుడు శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ ‘ఎండార్పిన్స్ ‘ విడుదల ఎక్కువవుతుంది. ద్వారా మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఈ సైకిల్యింగ్ వలన ఆందోళన, డిప్రెషన్ కూడా తగ్గుతాయని అధ్యయనంలో తేలింది. ఎక్కువగా ఒత్తిడితో బాధపడేవారికీ,మానసిక ఆందోళనకు గురి అయ్యే వారు ఈ సైక్లింగ్ చేస్తే ఉపశమనం దొరుకుతుంది. ఈ సైకిల్ ఇన్ వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రతిరోజు సైకిల్ చేస్తే మన శరీర కండరాలు పెరిగేందుకు తోడ్పడుతుంది. శరీరంలోని చెలు కొలెస్ట్రాల్ అంతా బయటికి చమట రూపంలో వెళ్ళిపోతుంది. తద్వారా బరువు తగ్గటానికి దోహదపడుతుంది. అయితే ప్రతిరోజు సైక్లింగ్ చేయటం మంచి వ్యాయామం అని అంటున్నారు. ఈ సైక్లింగ్ వలన క్యాలరీలో ఎక్కువగా బర్న్ అవుతుంటాయి. తద్వారా శరీరం బరువుని తగ్గించుకొనుటకు చాలా బాగా ఉపకరిస్తుంది.
కండరాల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి వాటితో ఇబ్బంది పడుతున్న వారు డాక్టర్ సలహా మేరకు సైకిల్ తొక్కడం అలవాటు చేసుకుంటే, కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. సైకిల్ తొక్కడం వల్ల కీళ్ల కు సపోర్ట్ లభిస్తుంది. ఇలా చేయటం వల్ల కీలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఆయా భాగాల్లో ఉండే వాపు నొప్పులు నుండి కూడా కొంత ఊరట లభిస్తుంది. అయితే సైకిల్ అనేది కార్డియో వ్యాయామం అంటున్నారు నిపుణులు. సైకిల్ తొక్కడం వల్ల గుండెకు కూడా చక్కటి వ్యాయామం అవుతుంది. సైకిల్ తొక్కడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. రక్త ప్రసరణ కూడా వేగవంతంగా ఉంటుంది. వార గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. హై బీపీ ఉన్నవారు రోజు సైకిల్ తొక్కితే హై బీపీ లెవెల్స్ తగ్గుతాయి. బిపి, షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ వంటివి నియంత్రణలో ఉంచవచ్చు.
సైకిల్ ని ప్రతిరోజు తొక్కడం వలన జీవక్రియ రేటు కూడా మెరుగుపరుస్తుంది. కండరాలను బలంగా పెంచుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాలను కరిగించి వేస్తుంది. బరువుతో బాధపడే వారికి ఈ సైక్లింగ్ కచ్చితంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల నా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ప్రతిరోజు సుమారు 30 నిమిషాల పాటు సైకిల్ ను తొక్కితే.. ఒక సంవత్సరం పాటు దాదాపు 5 కిలోల కొవ్వును కరిగించి వేస్తుందట. ఇప్పుడు బైకుల మీద ఎక్కువగా వెళుతూ ఉన్నారు. కానీ నిజానికి సైకిల్ మీద వెళితేనే ఆరోగ్యం. శరీరాన్ని అలసటకు గురి చేసే సైకిల్ మంచిది. కాలినడకన వెళ్లడం, మరొకటి సైక్లింగ్ చేయడం రెండు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బైక్ మీద వెళ్లడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. సైకిల్ ఇన్ చేస్తే సుఖ వత్తుల నుంచి దూరం అవడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.